ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేసే సినిమా అలా ఉంటుందట..!

Pulgam Srinivas
దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా సముద్రఖని ,అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో 'ఆర్ఆర్ఆర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. కొన్ని కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా ప్రతిష్టాత్మకమయిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత రాజమౌళి తరువాత ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహిస్తాడు అని జనాల్లో ఆసక్తి పెరిగింది.

 అయితే దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి ఇది వరకు మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే 'ఆర్ఆర్ఆర్' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే రాజమౌళి సినిమా చేస్తాడు అనే ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం ఒక బడా నిర్మాణ సంస్థతో అనేక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాల తెరకెక్కించాలనే  ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని రాజమౌళి చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసమా లేక వేరే ఇతర హీరో కోసమా అనేది క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: