బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కు "నాయక్"

Vimalatha
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ "నాయక్". 2013లో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆకుల శివతో కలిసి రాశారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య, ఎస్. రాధాకృష్ణసంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి స్కోర్, సౌండ్‌ట్రాక్ సమకూర్చారు. సాంగ్స్ మోత మోగించాయి అప్పట్లో. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. గౌతమ్ రాజు ఈ చిత్రానికి ఎడిటర్‌గా ఉన్నారు.
ఈ చిత్రంలో చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశాడు. అది సినిమాకే హైలెట్. హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన చెర్రీ, కోల్‌కతాలో యువ నాయకుడు సిద్ధార్థ్ నాయక్ రావత్ అనే దుర్మార్గపు రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఎలా పోరాడారు. చెర్రీ తనలాగే ఉన్న సిద్దార్థ్‌కి మంచి సాధించడానికి సహాయం చేయడం చుట్టూ సినిమా తిరుగుతుంది.
ఈ చిత్రం హైదరాబాద్, కోల్‌కతాలో షూటింగ్ జరుపుకుంది. కొన్ని పాటల చిత్రీకరణ దుబాయ్, ఐస్‌ల్యాండ్, స్లోవేనియాలో జరిగింది. స్లోవేనియాలో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ చిత్రంగా 'నాయక్' నిలిచింది. ఈ సినిమా చిత్రీకరణ 29 డిసెంబర్ 2012 న ముగిసింది. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా 9 జనవరి 2013న ప్రపంచవ్యాప్తంగా 1589 స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. బిజినెస్ పరంగానూ విజయం సాధించింది.
"నాయక్" చిత్రం ఏపీలోని పలు సెంటర్లలో బాక్సాఫీస్ వద్ద 50 రోజులు ఆడింది. సంక్రాంతి స్పెషల్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా తొలినాళ్లలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులను సృష్టించింది. 2013 మొదటి హిట్‌లో ఒకటిగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: