వృందావన ను మొదలుపెట్ట బోతున్న ప్రభాస్!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న ప్రభాస్ దీని తర్వాత మూడు భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ ఇతర హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కానీ రేంజ్ లో వరుస భారీ ప్రాజెక్ట్ లను సెట్ చేసుకుంటూ వెళుతున్న ప్రభాస్ వరుస హిట్ సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్య పడేలా చేస్తున్నాడు.

ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అలాగే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ లో ఒకేసారి పాల్గొంటూ శభాష్ అనిపించుకున్నాడు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని భారీ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టు కే సినిమా ఎలానో ఉంది. ఇలా నాలుగు సినిమాలు చేస్తూ ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమా ను చేసే విధం గా ఆలోచిస్తున్నాడు.  తన 25 వ సినిమాగా తెరకెక్కే ఆ సినిమా ను బెంచ్ మార్క్ సినిమాగా చేయాలనేది ప్రభాస్ ఆలోచన. 

ఈ బాధ్యతలను దిల్ రాజు టేకప్ చేయగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వృందావన అని ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దాదాపుగా ఈ సినిమా కి ఈ టైటిల్ కన్ఫామ్ అయినట్లుగా కొత్త న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ చిత్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ సినిమా కు సంబంధించి మరొక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ నెలలో ఈ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది అని అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుందని చెబుతున్నారు. భారీ పిరియాడిక్ సినిమా గా భారీ బడ్జెట్ తో వస్తున్న దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా గురించి వచ్చిన వార్తలు నిజమో కాదో తెలియాలంటే దిల్ రాజు అయినా నోరు విప్పాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: