పవన్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి .... ??

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్, ఆయనతో తొలిసారిగా 2012లో చేసిన సినిమా గబ్బర్ సింగ్. అంతకముందు బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ సినిమా దబాంగ్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గబ్బర్ సింగ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ యాక్టింగ్, పలికిన డైలాగులు, ఫైట్స్, మాస్ యాక్షన్ సీన్స్ ఈ మూవీకి ప్రధానాకర్షణగా నిలిచాయి. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బీజీఎమ్ తో పాటు సాంగ్స్ కూడా సూపర్ గా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఆ తరువాత మరొక్కసారి పని చేయడానికి సాధ్యపడని ఈ ద్వయం, మళ్ళి దాదాపుగా తొమ్మిదేళ్ల విరామం తరువాత భవదీయుడు భగత్ సింగ్ సినిమా ద్వారా త్వరలో జత కట్టనున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న న్యూస్. సినిమాలో హీరో పవన్ క్యారెక్టర్ తో పాటు విలన్ పాత్ర కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని, అందుకే అటువంటి పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే పక్కాగా సరిపోతారని భావించిన మేకర్స్ ఆయనని ఇటీవల సంప్రదించదలిచినట్లు సమాచారం. కాగా త్వరలో దీనిపై అధికారిక సమాచారం కూడా వెల్లడి కానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక వాస్తవం అయితే పవర్ స్టార్ మూవీలో విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని చూడవచ్చన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: