చరణ్ మూవీలో మరొక హీరోయిన్ .... ??

GVK Writings
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఇటు ఆచార్య సినిమా కూడా చేస్తున్నారు. అయితే వీటిలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దానయ్య ఎంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆచార్య లో తన పార్ట్ షూట్ కూడా పూర్తి చేసారు చరణ్.
అయితే ఈ రెండు మూవీస్ తరువాత మరొక బిగ్ డైరెక్టర్ శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయడానికి ఇప్పటికే సిద్ధం అయ్యారు చరణ్. ఇటీవల ఎంతో వైభవంగా అధికారిక పూజా కార్యక్రమాలు కూడా ఈ మూవీ జరుపుకుంది. భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగుతూ తన మార్క్ భారీ విజువల్స్ మరియు మెసేజ్ వంటి అంశాలను కూడా కలగలిపి శంకర్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తీయనున్నట్లు టాక్ . కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేయనున్నట్లు సమాచారం.
అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా నటించనుందని, ఇప్పటికే ఆ పాత్ర కోసం ఒక యువ నటిని ఎంపిక చేసిన యూనిట్, త్వరలో ఆమెని కలిసి కాల్షీట్స్ తీసుకున్న అనంతరం అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ వారి 50వ మూవీ గా ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించనున్నారు. ఇక ఈ భారీ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: