క‌ల‌ర్ అండ్ కాంట్రాస్ట్ : న‌లుపే అడ్డంకి అవుతుందా?

RATNA KISHORE
రంగు కార‌ణంగా అవ‌మానాలు వ‌స్తాయి
శ‌రీరం కాస్త తెలుపులోకి మారిపోవాలి లోకం కోసం
న‌ల్ల‌గా ఉన్నావు నీవు హీరో అవుతావా! హా!హా! న‌వ్విపోయారు ధ‌నుష్ ను చూసి..న‌ల్ల‌గా ఉన్నావు నీవు హీరోయిన్ అవుతావా! అని న‌వ్వి పోయారు రోజాను చూసి.. న‌వ్విపోయిన వారంతా జీవితాన్ని మార్చారు అని చెబుతున్నారు రోజా.. అదే మాట కాస్త మార్చి ఎప్పుడో చెప్పాడు ధ‌నుష్. చెప్పానుగా! జీవితం ఓట‌మి నుంచి ఎన్నో ఇచ్చిపోతుంది అని..వాటిని విశ్లేషించ‌క ఉంటే  విజ యాలు వ‌రించ‌వు.. అవ‌మానాలే మిగులుతాయి.. అలాంటి చోట మీరున్నా నేనున్నా వ్య‌ర్థ‌మే! మీకు పిల్ల‌లు పుట్ట‌రు అని చెప్పా రు ఆమెకు వైద్యులు..ఆ ఘ‌ట‌న‌నూ త‌ల్చుకుని ఏడ్చేశారు రోజా. ఏం ఉన్నా లేకున్నా నా సంతోషం నా ఆస్తి నా పిల్లలు అని చెబుతున్నారు రోజా.. అవును! ఎవ‌రింటి ఆస్తి అయినా పిల్ల‌లే కావాలి..వారే రేప‌టి భారతావ‌ని నిర్దేశ‌కులు. మీకు రంగుతో ప‌నేంటి?
ఊరిలో వినాయ‌కుడు కార్య‌క్ర‌మంలో ఈటీవీలో వ‌స్తుంది. ఆమె చెబుతున్నారు త‌న జీవితం గురించి.. నాలుగు డ‌బ్బులు పోయిన రోజులు గురించి..అవ‌మానాలు మిగిల్చి ఇచ్చిన క‌న్నీళ్ల గురించి. ఈ షో  నుంచి ఈ రోజు నుంచి రోజా మీకు బాగా అర్థం అవుతా రు. న‌టీన‌టుల రంగుల ముఖాలు వెనుక వెల వెల బోయిన ఎన్నో కాలాలు రంగులూ ఉంటాయి అని.. న‌వ్వులు లేని రోజు ఒక‌టి ఉంటుంది అని.. న‌వ్వులు ఉన్నా ఏడుపు ఉన్నా అన్నింటికీ స‌మాధానం జీవితం మాత్ర‌మే ఇస్తుంది అని..అన్నింటినీ ఓర్చుకోవ డంలో శ‌క్తి మాత్రమే మ‌నిషి ద‌క్కించుకోవాలి. ఆ శ‌క్తికి ప్రాణ విలువ జోడించాలి. అప్పుడే విజ‌యం. రంగు బాలేద‌ని ధ‌నుష్, రంగు బాలేదు అని రోజా , నీవేం బాగుంటావు అని ర‌మ్య‌కృష్ణ ఇలా ఎంద‌రో అవ‌మానాలు దాటి వ‌చ్చిన వారు. వారిపై మ‌న‌కు గౌర‌వం కాస్త ఉంటే రేప‌టి నుంచి వారు మీకు అత్యంత  సులువుగా అర్ధం అవుతారు. రాజ‌కీయం ఇవ‌న్నీ నేర్ప‌దు. సినిమా  ఇవ‌న్నీ నేర్ప దు.


గౌర‌వం, పేరు వచ్చాక సినిమా వాళ్ల‌పై మ‌న‌కు చిన్న‌చూపు కూడా పెరిగిపోతుంది. రాజకీయ నాయ‌కులు అన్నా మ‌న‌కు చిన్న చూపు వ‌చ్చేస్తుంది. ఇవి చెరిపేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీ జీవితంలో తోడుండే అమ్మ, తోడుండే నా న్న, వీరితో పాటు అమ్మ‌నాన్న‌ల‌కు మించిన ప్రేమ అందించే అన్న‌య్య‌లు ఉండాలి అని చెబుతారు రోజా. అంత‌కుమించిన జీవిత భాగ‌స్వామి సెల్వ‌మ‌ణి..ఆమె చెప్పిన మాట‌లు కొన్ని రోజులు మీకు గుర్తుండి పోతాయి. జీవితం నుంచి మీరు తీసుకున్న‌వి తీసు కుని వాటిని జాగ్ర‌త్త చేయండి. జ్ఞాప‌కాలు అవుతాయి. జాగ్ర‌త్త ప్ర‌తి జ్ఞాప‌కం విలువైన‌దే!

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: