జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఏం జరిగింది..?

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 2010 సంవత్సరం వరకు మాస్ హీరోగా ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2015లో టెంపర్ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో మోడ్రన్ గా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా అని జనతా గ్యారేజ్.. ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద తన సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాడు.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ లు రాబట్టిందో..? ఈ సినిమా విశేషాలు ఏమిటి..? అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
అప్పటి వరకు ఎన్టీఆర్ ను ఎవరు చూడని విధంగా ఒక సరికొత్త రూపంలో చూపించాలని కొరటాల శివ, నాలుగు నెలలు కష్టపడి ఒక స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఇక ఇందులో ఎన్టీఆర్ పెదనాన్న పాత్రకు బాలకృష్ణను అనుకోగా ఆయన ఒప్పుకోకపోవడంతో మోహన్ లాల్ ను ఎంచుకున్నారు. కేరళ వెళ్లి మోహన్ లాల్ కు కథ చెప్పి పట్టుబట్టి మరీ ఒప్పించాడు కొరటాల. అయితే ఈ విషయాలను ఎక్కడ రివీల్ చేయకుండా 2015అక్టోబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. వెంటనే సినిమా టైటిల్ ని విడుదల చేయడంతో అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హీరోయిన్ లుగా అమైరా,సమంత ను అనుకున్నారు. చివరకు అమైరా పాత్రలో సమంత ,సమంత పాత్రలో నిత్యామీనన్ ను తీసుకున్నారు.
హైదరాబాద్ సారధి స్టూడియోలో మూడు కోట్ల ఖర్చు తో ఈ సినిమా సెట్ వేశారు. సారధి స్టూడియోలో ఎన్టీఆర్ షూటింగ్ జరుపుకుంటున్నారని తెలియడంతో, అక్కడికి కొన్ని వేల మంది అభిమానులు రావడంతో వారిపైన పోలీసులు కూడా లాఠీఛార్జి చేశారు. అయితే అక్కడకు వచ్చిన ఎన్టీఆర్ పోలీసులతో గొడవ పడి, అభిమానులను కలవడం జరిగింది. ఇక పక్క లోకల్ అనే పాటకు తమన్నా అనుకోగా చివరకు కాజల్ ను ఫైనల్ చేయడం జరిగింది. సెప్టెంబర్ - 1- 2016 వ తేదీన సినిమా రెండు వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. మొత్తం రూ.55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. రూ. 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 13 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ తోనే హిట్ అయినప్పటికీ మోహన్ లాల్ కు నేషనల్ అవార్డు, డాన్స్ మాస్టర్ కు నేషనల్ అవార్డులతో పాటు 7 నంది అవార్డులు కూడా సొంతం చేసుకుంది.ఇక నిర్మాతలకు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: