స్పోర్ట్స్ బైక్ లు అంటే హీరోలకు ఎందుకంత మోజు ?

VAMSI
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది మన ప్రాణం. మన జీవితంలో ఏవీ పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్క ప్రాణం మాత్రం పోతే మళ్లీ రాదు. అలాంటి ప్రాణంతో స్టైల్, క్రేజ్, పాపులారిటీ ల కోసం ఎంతో మంది యువత బైక్ మరియు కార్ రేసింగ్ లని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే వీరంతా కూడా సినిమాల్లో హీరోలు కార్లు మరియు బైక్ లతో చేసే ఫీట్లు మరియు ఫైట్ లను చూసి మేము వారిలాగే చెయ్యాలి అనుకుంటారు. కానీ అక్కడే యువత పొరపాటు చేస్తోంది. సినిమాలో అలాంటి ప్రమాదకరమైన స్టంట్ లు హీరోలు చేసేవి దాదాపుగా గ్రాఫిక్స్ లేదా డూప్ చేస్తుంటారు. వాటిని చూసి అనుకరించే మార్గంలో మన వాళ్ళు దెబ్బ తింటున్నారు. నిన్ననే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై వస్తుంటే స్కిడ్ అయి పడ్డాడు. త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
గతంలో సినీ నటుల కుమారులు కొంత మంది రోడ్ ప్రమాదాలలో చనిపోయారు. వారిలో కోట మరియు బాబు మోహన్ కొడుకులు ఉన్నారు. ఈ ప్రమాదాలకు కారణం  అవుతున్న ఈ బైక్ లు అంటే ఎందుకు హీరోలు అంత ఇష్టం చూపిస్తారు. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మరియు బాలకృష్ణ లు వారి సినిమాల్లో ఎన్నో బైక్ ఛేజింగ్ సీన్ లలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న యువ హీరోలు అందరికీ ఫారిన్ స్పోర్ట్స్ బైక్ లు అంటేనే పిచ్చి.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బైక్ లంటే మహ సరదా అట. ఎన్నో బైక్ లు ఉన్నా హర్లీ డేవిడ్ సన్ బైక్ అంటే చెవి కోసుకుంటారని తెలుస్తోంది. ఇప్పుడు అదే అలవాటు మన మెగా  మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు వచ్చినట్లుంది.
ఇక ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా బైక్ లు మరియు కార్లు అంటే ఇష్టం.  కొత్త మోడల్ లో ఏదయినా కార్ కానీ బైక్ కానీ వస్తే వెంటనే కొనేస్తారు. పవన్ లాగా ఎన్టీఆర్ కు కూడా హార్లీ డేవిడ్ సన్ బైక్ అంటేనే ప్రాణం.  వీల్లే కాకుండా మిగతా అందరి హీరోలకు ఇంపోర్టెడ్ బైక్ లు అంటే ఇష్టమే. కానీ పబ్లిక్ లో తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ హెల్మెట్ వేసుకుని అప్పుడప్పుడు షికారుకు వెళుతుంటారు. ఇక్కడ రీడర్స్ అందరికీ ఏపిహెరాల్డ్ తరపున ఒక విన్నపం. బైక్ అంటే ఇష్టం ఉండడం మంచిదే. కానీ డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. నిబంధనలకు మించిన స్పీడ్ లో వెళ్ళకండి. మీ ఫ్యామిలీ కి మీ అవసరం చాలా ఉంది. కాబట్టి ఆలోచించి బైక్ నడపండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: