బండ్ల గణేష్ కి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఈ క్రమంలోనే జీవిత రాజశేఖర్ కి తానూ వ్యతిరేకంగా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రస్తుతం బండ్ల గణేష్ తెగ హడావిడి చేస్తున్నాడు. ఇంతకీ బండ్ల ఎందుకు ఇలా సడెన్ గా ప్రకాష్ రాజ్ కి హ్యాండ్ ఇచ్చాడు అంటే. దాని వెనుక పవన్ మెప్పు కోసమే అన్నట్టు ఉంది వ్యవహారం.
జీవితా రాజశేఖర్ గతంలో మెగాస్టార్ కుటుంబం పై అనేక వ్యాఖ్యలు చేసింది. పైగా చిరును కూడా ఆమె తిట్టింది. కాబట్టి దానికి నిరసనగా తాను జీవిత పై పోటీ చేస్తున్నట్లు బండ్ల బాబు తాజాగా చెప్పుకొస్తున్నాడు. మరీ పవన్ కళ్యాణ్ ను రోజూ ఎవరో ఒకరు తిడుతూనే ఉంటారుగా. మరి వారి పై బండ్ల ఎందుకు సీరియస్ అవ్వట్లేదు.
పైగా పవన్ ను తిట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి, చివరకు ఓడిపోయాక ఆ పార్టీకి బ్రేకప్ చెప్పి.. మళ్ళీ పవన్ తో సినిమా చేయడానికి ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు బండ్ల. ఈ క్రమంలో జీవిత పై పోటీ అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు జీవితకి పెద్దగా సపోర్ట్ లేదు కాబట్టి.. ఆమె మీద పోటీ చేసి గెలిచి తానేంటో చూపించాలి అని ఆశ పడుతున్నాడు.
కానీ, మరోపక్క బండ్ల గణేష్ ను కూరలో కరివేపాకులా తీసి పడేస్తోంది జీవిత. అసలు బండ్ల తనకు లైట్ అంటూ ఆమె చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో జీవిత మాట్లాడుతూ...'బండ్ల గణేశ్ తో నాకు ఎలాంటి విభేదాలు గానీ, ఎలాంటి గొడవలు గానీ ఇప్పటివరకు లేవు. అయితే, ఆయన నా పై పోటీ చేస్తాను అని ప్రకటించారు, మంచిది.
ప్యానెల్ లో ఉన్న లేకున్నా… ‘మా’లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. పైగా బండ్ల గణేశ్ ‘మా’ అభివృద్ధి కోసం పని చేస్తాను అని, ఎంతో కృషి చేస్తానని చెబుతున్నారు. మా సభ్యుల సంక్షేమం కోసం బండ్ల గణేష్ పోటీ చేస్తే మాకు మంచిదే. అందుకే నేను బండ్ల పోటీని స్వాగతిస్తున్నా' అంటూ జీవిత చెప్పింది. మొత్తానికి బండ్లను జీవిత లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది.