సిద్దార్థ్ శుక్లా ఎవరో తెలుసా ? ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం

Vimalatha
సిద్దార్థ్ శుక్లా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. "బిగ్ బాస్13 విజేత అయిన ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ మరణం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. సిద్ధార్థ్ ఇండస్ట్రీలోని అందుకోడానికి తన మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నాడో తెలుసుకుందాం.
సిద్దార్థ్ శుక్లా 1980 డిసెంబర్ 12న ముంబైలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సిద్దార్థ్ శుక్లా ముంబై లోనే పుట్టి పెరిగాడు. అయన తండ్రి పేరు అశోక్ శుక్లా, తల్లి రీటా శుక్లా. సిద్ధార్థ్ మోడలింగ్ రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. సిద్ధార్థ్ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఫోర్త్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. కోర్సు పూర్తయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు అడుగేసాడు. 2014లో మొదటిసారిగా రాంప్ వాక్ చేశారు. అందులో రన్నరప్ గా నిలిచిన సిద్ధార్థ్ ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. ఆ భోజ్పురి వీడియో అప్పట్లో వైరల్ అయింది.
2005లో టర్కీ లో జరిగిన ప్రపంచ అత్యుత్తమ మోడల్ పోటీలో పాల్గొన్నారు. అందులో ఆసియా, లాటిన్, అమెరికా, ఐరోపా వంటి దేశాల నుంచి 40 మంది పోటీ చేయగా... అందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క భారతీయుడు సిద్ధార్థ శుక్ల. ఆ తర్వాత పలు యాడ్ లో కనిపించిన సిద్ధార్థ్ 2008లో మూవీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. సిద్ధార్థ్ మొదట పలు సీరియళ్ళలో కనిపించినప్పటికీ "బాలికా వధు (చిన్నారి పెళ్ళికూతురు)" సీరియల్ తో మంచి గుర్తింపు లభించింది. ఈ సీరియల్ గాను ఆయన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2015 లో ఈ సీరియల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో, షోలలో కన్పించాడు.
2014 సంవత్సరంలో సిద్ధార్థ్ 'సవధాన్ ఇండియా'లో కనిపించాడు. ఆ తర్వాత భారతీ సింగ్‌తో కలిసి 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోను నిర్వహించాడు.  'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7', 'దిల్ సే దిల్ తక్' లో రష్మీ దేశాయ్, జాస్మిన్ భాసిన్‌తో కలిసి పాల్గొన్నాడు. 2019 సంవత్సరంలో 'బిగ్ బాస్ 13' విజేతగా నిలిచిన సిద్ధార్థ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. దీని తర్వాత శుక్లా కూడా సీనియర్ పోటీదారుగా 'బిగ్ బాస్ 14' కి చేరుకున్నారు. సిద్ధార్థ్ 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' తో వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఆయన ఇండస్ట్రీ ప్రయాణం ఇలా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: