పరాయి బాషా చిత్రాలను ఏలుతున్న తెలుగు వాళ్ళు !

Siva.K

జానీ లివర్ :


హిందీ సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లో పేరుగాంచిన గొప్ప  కమెడియన్ జానీ లివర్. ఈయన స్వస్థలం ఒంగోలు దగ్గర ఊరట అనే గ్రామం.  చిన్నప్పుడే  ముంబైకి వెళ్లిపోవడం వల్ల, జానీ లివర్ అక్కడే స్థిరపడిపోయారు. తెలుగులో ఒకటో రెండో సినిమాలు కూడా  చేసారు,  హిందీ ప్రేక్షకులకు బ్రహ్మానందం లాంటి హాస్య నటుడు.  

సంపత్ రాజ్
ప్రతి తెలుగు సినిమాలో కనిపిస్తోన్న తమిళ నటుడు. కానీ సంపత్ రాజ్ తెలుగు వ్యక్తే.  ఈయన తండ్రి ఒక తెలుగు ఆయనే.  నిజానికి  2003లోనే  తన సినిమా కెరీర్ ను మొదలెట్టారు. కానీ ఏడేళ్లుగా  తెలుగు సినిమాలో ప్రసిద్ధి అయ్యారు.   ఇతర సినీ పరిశ్రమల్లో ఎక్కువగా ప్రసిద్ది అయినా తెలుగు వ్యక్తులలో సంపత్ రాజ్ కూడా ఒకరు.

పైడి జయరాజ్:


ఈ తరం ప్రేక్షకులకు  ఈ పేరు గల నటుడు ఉన్నాడని కూడా తెలియదు. పైడి జయరాజ్  1960 కాలంలో హిందీలో  బాగా  ప్రజాదరణ పొందిన  నటుడు.  షోలే సినిమాలో కూడా నటించారు.  సుమారు 65 సంవత్సరాల సినీ జీవితం ఈయనది,  పైడి జయరాజ్ కూడా   తెలుగు వ్యక్తే.  

రోహిణి :
సహజమైన హావభావాలకు  ఈమె కేరాఫ్ అడ్రెస్.  ఈవిడ తెలుగావిడే.  తెలుగులో బాల్యనటిగా ఎన్నో సినిమాలు చేశారు.  హీరోయిన్ గా కూడా చాలా సినిమాలు చేశారు.  కానీ తెలుగు అమ్మాయి అవడం చేత  ఈమెకు తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. దాంతో తమిళం, మలయాళం సినిమాలలో  ఎక్కువగా నటించారు.  అందుకే  ఈవిడను తమిళం అమ్మాయి, కొందరేమో మలయాళీ అని అనుకుంటారు.
 
దియా మిర్జా, అదితీరావు హైదరీ

బాలీవుడ్ లో ఫేమస్ అయిన వీరిద్దరూ  పక్కా హైదరాబాదీ అమ్మాయిలు. తెలుగులోనే  కెరీర్ ను స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేసినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో  బాలీవుడ్ కి వెళ్లి  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  

మురళి శర్మ :
మురళి శర్మ  కూడా తెలుగు వారే.   ఇతర సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకుని మళ్లీ తెలుగులో తిరిగి వచ్చి  సక్సెస్ అయిన నటుడు మురళి శర్మ.

విశాల్

తెలుగు కుటుంబానికి చెందినవాడే. తెలుగులో డబ్ అయిన సినిమాలు బాగా ఆడాయి. కానీ, నేరుగా తెలుగులో చేసిన సెల్యూట్ మాత్రం నిరాశపరిచింది.  

శ్రీరామ్

ఒకరికొకరు సినిమా హీరో గుర్తున్నాడా? అతనే ఈ  శ్రీరామ్. తెలుగులో ఇంకొన్ని చిన్న పాత్రల్లో అక్కడక్కడా మెరిసినా.. తమిళంలోనే గుర్తింపు వచ్చింది. కానీ శ్రీరామ్ తెలుగు వ్యక్తి.
 
వైభవ్

డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు. గొడవ, ఇంకొన్ని తెలుగు సినిమాలు చేశాడు. కానీ.. తమిళంలోనే బాగా గుర్తింపు వచ్చింది. అలాగే  జయం రవి, రవి శంకర్, అయ్యప్ప  ఇలా ఇంకా  ఎందరో తెలుగువారు ఇతర సినీ పరిశ్రమలోని ఎక్కువగా ప్రసిద్ధి చెందారు.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: