ప‌వ‌న్ అంటే ప‌వ‌ర్ : బంగారం లాంటి హీరో !

RATNA KISHORE

డ‌బ్బులు మీరు పంచ‌కండి ఈ మ‌నుషుల‌ను న‌మ్మ‌కండి అని పూరీ జ‌గ‌న్నాథ్ స‌లహా ఇచ్చారు. న‌వ్వి ఊరుకున్నారు. మాన‌వ త్వం అన్న పెద్ద పెద్ద ప‌దాలు వాడ‌కండి మీకు తోచినంత సాయం చేయండి. నేను న‌మ్మ‌ని దారిలో ప్ర‌యాణం చేయ‌ను.. న‌మ్మిన మ‌నుషుల‌ను వ‌దులుకోను అని కూడా అంటారు ప‌వ‌న్. ఎంద‌రికో సాయం చేయ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న బంగారం అయ్యారు. బంగా రం లాంటి మ‌నిషి అయ్యారు. ఎంద‌రికో నేనున్నాను అని చెప్పి పంపారు. క‌డ‌దాకా వారికి సాయం అందించేందుకు సిద్ధం అని ని రూపించారు. ఏటా ఈ వేడుక‌లు వ‌ద్దు మీరు హాయిగా ఉండండి నా పేరిట జ‌రిగే వేడుక‌లు క‌న్నా పేద‌లకు మీరు ఏమ‌యినా చే యండి ఆనందిస్తాను అని అంటారు.



ప‌వ‌న్ మారుమూల ప‌ల్లెల‌కు పోయిన రోజులున్నాయి. షూటింగ్ ల సంద‌ర్భంగా చుట్టుప‌క్క‌ల వారితో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవ్వ‌రు క‌ష్టం అని వ‌చ్చినా క‌దిలిపోతారు. త‌న కోసం ఏం చేసినా ఇష్ట‌ప‌డ‌రు. త‌న నిర్మాత‌ల‌కూ, ద‌ర్శ‌కుల‌కూ ప‌దే ప‌దే ఇవే చెబుతారు. కొన్ని క‌ష్టాలు ప‌ల‌క‌రించాక తాను ఒంట‌రి అయిపోయాన‌ని అంటారు.నేను పెద్ద‌గా చ‌దువుకోలేదు భ‌యం చాలా ఉండేది ఇవ‌న్నీ దాటుకుని సినిమాలు చేయ‌డం ఇప్పుడొక ఆశ్చ‌ర్యం.



గ‌ణేశ్ మాస్ట‌ర్ కు జీవితం ఇచ్చాడు. సినిమా పోయినా స‌రే మ‌ళ్లీ పిలిచి డైరెక్ష‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన దాఖ‌లాలు ఎన్నో! కానీ వీటికి మించి సామాన్యుల‌కు తాను ఏం చేయ‌గ‌ల‌నో అన్న‌ది ఆలోచిస్తాడు. అందుకు మొన్న‌టి క‌రోనా వేళ త‌న అభిమానుల‌కు కొన్ని సూచ‌న‌లు చేసి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపిణీ చేయించాడు. తిత్లీ తుఫాను వచ్చినా, హుద్ హుద్ తుఫాను వ‌చ్చినా ముం దుగా స్పందించేది ప‌వ‌న్ క‌ల్యాణే ! బాధిత ప్రాంతాల‌కు అభిమానులు పంపి తోచిన రీతిలో సాయం చేయ‌మ‌ని చెప్పిన‌వాడు ప‌వ న్ క‌ల్యాణే! ఇదే కాదు లాక్డౌన్ వేళ కూడా త‌మ‌వంతు సాయం చేయ‌మ‌నే అభిమానులకు చెప్పాడు. మీరు త‌గువులు కాదు ప‌డా ల్సింది మ‌నుషుల‌కు సాయం చేయండి చాలు ఇంకేమీ వ‌ద్దు అని ఎప్పుడూ హిత బోధ చేస్తాడు. మ‌నుషుల‌ను గౌర‌విం చండంలో ప‌వ‌న్ ను మించిన వారు లేరు అని కూడా నిరూపించాడు కొన్ని సార్లు. మీరు పాట‌లు రాసినా, మాట‌లు రాసినా నేను చ‌దువుతాను వింటాను కానీ వాటికో హుందాత‌నం ఉండాలి అని మాత్ర‌మే అంటారు కొంద‌రు ర‌చయిత‌ల‌ను ఉద్దేశించి.. త‌న పేరు పెద్ద‌గా వినిపించ‌డం ఇష్ట‌ప‌డ‌డు కానీ త‌న అభిమానులు మంచి ప‌నులు చేస్తే మాత్రం త‌ప్ప‌క సంతోషిస్తాడు. ముఖ్యంగా చిన్నారుల క‌ష్టాల‌కు చ‌లించిపోతాడు. ఏమ‌యినా  చేయాలా చెప్పండి చేస్తాను అని మాట‌ల‌తో స‌రిపుచ్చ‌క, స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న‌వంతు ఆర్థిక సాయం చేసి దాతృత్వం చాటుకుంటాడు. న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టకండి త‌ప్పు క‌థ‌ను న‌మ్మి డ‌బ్బులు పెట్టండి చాలు అని నిర్మాత‌ల‌ను హెచ్చ‌రిస్తాడు కూడా! సినీ కార్మికుల‌కు చేయాల్సినంత సాయం ఎప్ప‌టిక‌ప్పుడు చేసే బంగారం అత‌డు. త‌న విలువ తానే పెంచుకుంటాడు. త‌న విలువ‌ను తెల్సుకున్నవాళ్లే త‌న వాళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: