దసరా దీపావళి కి మోత మోగించనున్న తమన్!!

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు తమన్. ఆయన చేతిలో దాదాపు పది ప్రాజెక్టులు అది కూడా పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయి అంటే తమన్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  కాగా 2020-21 వ సంవత్సరం ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని చెప్పవచ్చు. తమన్ ఏ సినిమా చేసినా అది మ్యూజికల్ హిట్ గా నిలుస్తుంది.

ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం దసరా, దీపావళి పండగల సందర్భంగా ఆయన సంగీతం అందించిన సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గతంలో సంక్రాంతి ఉగాది పందాల నేపథ్యం లో ఆయన సినిమా లు పాటలు రాగా అవి సూపర్ హిట్ గా నిలుస్తూ తమన్ కి మరింత గుర్తింపు తీసుకు వచ్చాయి.  ఆ విధంగా ఈ సంవత్సరం ఫెస్టివల్ స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంక్రాంతి సమయంలో క్రాక్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సంగీతంతో అలరించిన తమన్ ఆ తరువాత ఉగాది సమయంలో వకీల్ సాబ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేశాడు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో రెండు ముఖ్యమైన పండుగలలో తన స్వరాలతో ప్రేక్షకులను మరొకసారి అలరించనున్నాడు. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రానికి తమన్ సంగీతం అందించగా వినాయక చవితి సందర్భంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. ఇప్పటికే ఓ పాట ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా మిగితా పాటలు కూడా వారు చిందేసే విధంగా ఉంటాయట. దీపావళి సీజన్ లో వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తమన్.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతుందగా ఈ సినిమాకి సంగీతం వేరే లెవెల్ అందించాడు అంటున్నారు తమన్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: