శాకుంతలం ఫినిష్...ఎమోషనల్ అయిన చిత్రబృందం..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అక్కినేని సమంత హీరోయిన్ గా దేవ్ మోహన్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'శాకుంతలం'.ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ని పూర్తి చేసుకొని గుమ్మడికాయ కొట్టేశారు. ఈ భారీ పౌరాణిక సినిమాలో సమంత లీడ్ రోల్ లో నటిస్తుంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అంటూ ఒక అఫీషియల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేశారు. దర్శకుడు గుణశేఖర్ , చిత్ర నిర్మాత నీలిమ సినిమా యూనిట్ మొత్తానికి చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చారు. ఈ సినిమాకు వీడ్కోలు పలికే సందర్భంలో చిత్రయూనిట్ కాస్త ఎమోషనల్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు.

 మహాభారతంలో ఆదిపర్వం నుండి తీసుకున్న శకుంతల మరియు దుష్యంతుల తన ప్రేమ కథను వెండితెరపై 'శాకుంతలం' పేరుతో తెరకెక్కించారు. ఈ ప్రేమకథలో సమంత జోడిగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. సమంత కెరియర్ లో ఇప్పటివరకు పౌరాణిక సినిమాలలో నటించలేదు. ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సినిమాలో మరో విశేషం అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ఈ సినిమాలో నటించడం. గుణ టీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, పతాకాలపై పాన్ ఇండియా చిత్రంగా నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసి ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. దర్శకుడు గుణశేఖర్ , అనుష్క హీరోయిన్ గా రానా హీరోగా , అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన 'రుద్రమదేవి' సినిమా తో మంచి హిట్ కొట్టాడు. అందుకే 'శాకుంతలం' సినిమాపై జనాలు మంచి అంచనాలే పెట్టుకున్నారు దానికి ప్రధాన కారణం గుణశేఖర్ పౌరాణిక సినిమాలను వెండితెరపై బాగా చూపిస్తాడు అని వారి నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: