సామ్‌కు షాక్ ఇచ్చిన వెర్సటైల్ యాక్టర్..?

Suma Kallamadi

హీరోయిన్ సమంత అక్కినేని మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామకు ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో  బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్‌గా ఎన్నికైంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ టూ‌లో సామ్ నటనకుగాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ హయ్యెస్ట్ వ్యూస్ పొందింది. సామ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘జాను’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘96’కి రీమేక్. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ సరసన సామ్ నటించింది. ఇక బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్‌గా సామ్ ఎన్నికైన నేపథ్యంలో  సినీ అభిమానులు ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు.
కాగా ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్‌లో సామ్‌కు వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ షాక్ ఇచ్చారు. సెట్స్‌లో ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనతో కేక్ ట్ చేయించి ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అక్కినేని సమంత ప్రస్తుతం ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రంతో పాటు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’లో నటిస్తోంది.  ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌కు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు
ఈ చిత్రం ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ సినీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ప్రకృతి ప్రియమైన ‘శాకుంతలం’గా సామ్ రికార్డు క్రియేట్ చేయబోతుందంటూ సినీ అభిమానులు పేర్కొంటున్నారు. కాళి‌దాసు రచించిన మైథలాజికల్ డ్రామా ‘శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా, దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. భరతుడిగా అల్లు అర్హ నటిస్తోంది. గుణ టీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సమంతకు ఇది తొలి చారిత్రక చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: