అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే హిట్లర్!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997వ సంవత్సరంలో వచ్చిన చిత్రం హిట్లర్. ప్రముఖ నటుడు ఎల్.బి.శ్రీరామ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించగా ఈ చిత్రం 42 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుని చిరంజీవి కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా తెరకెక్కింది. రంభ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మలయాళంలో 1996లో అదే పేరుతో తెరకెక్కిన చిత్రానికి రీమేక్. అక్కడ మమ్ముట్టి, శోభన జంటగా నటించారు.

కోటి సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అన్నా చెల్లెల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రాగా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించింది ఈ సినిమా. ముఖ్యంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది అని చెప్పవచ్చు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తన చెల్లెళ్లకు తానే తల్లి తండ్రి అయి పెంచి పోషిస్తాడు కథానాయకుడు. అయితే ఓ వయసు వచ్చాక చెప్పుడు మాటలు, అపార్థం చేసుకుని ఎవరి దారి వారు చూసుకునే విధంగా అన్నయ్య ను మోసం చేస్తారు. 

ఈ నేపథ్యంలో వారు తిరిగి తన అన్నయ్య ఎలా చేరుకున్నారు అనేదే ఈ సినిమా కథ. వినగానే ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఉన్న ఈ సినిమా కథ ను అదే రేంజ్ లో తెరకెక్కించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించగా హీరో స్నేహితుడిగా ప్రేక్షకులను ఓ సన్నివేశంలో కంటతడి పెట్టించాడు. ఈ సినిమాకు వచ్చే క్లైమాక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే విభిన్న చిత్రం గా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో చిరు చేల్లెల్లుగా చేసిన వారి కెరీర్ కూడా ఈ సినిమా తర్వాత మంచి ఊపందుకున్నాయి.. ఏదేమైనా ప్రతి రాఖి పండగ రోజు అందరు చూడాల్సిన సినిమా హిట్లర్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: