విరుష్క జంట షాడో ఎవరో తెలుసా.. ?

Suma Kallamadi
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అగ్రతార అనుష్క శర్మ అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. వివాహబంధంతో ఒక్కటైన వీరిద్దరి క్రేజ్ మరింత పెరిగిపోయింది. సాధారణంగా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం మంచి విషయమే కానీ బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సెలబ్రిటీలకు తమకంటూ ఒక బాడీగార్డు లేకపోతే బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరూ అంగరక్షకులను నియమించుకుంటారు.
అయితే అనుష్క శర్మ చాలా కాలం క్రితమే ప్రకాష్ సింగ్ (సోనూ) అనే బాడీగార్డ్ ని పెట్టుకున్నారు. ఇతను ఇప్పటికీ అనుష్క శర్మకు భద్రత కల్పిస్తున్నారు. అనుష్క శర్మ జీవితంలోకి విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత కూడా సోనూ బాధ్యత మరింత ఎక్కువైంది. అనుష్కతో పాటు ఆమె భర్తకు కూడా సోనూ రక్షణ కల్పిస్తున్నారు. కోహ్లీ కి ప్రత్యేకంగా పర్సనల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సోనూ మాత్రం ప్రేమతో కోహ్లీకి సెక్యూరిటీ కల్పిస్తుంటారు. బయటికి వెళ్లినప్పుడు అభిమానులు ఎగబడతారు కాబట్టి వారందరినీ కంట్రోల్ చేయడానికి సోనూ బాగా కృషి చేస్తుంటారు. ఒంటి చేత్తో ఇద్దరికి కూడా భద్రత కల్పించగల సత్తా అతనికి ఉంటుంది. చాలా సమర్థమైన బాడీగార్డ్ కాబట్టే అతనికి ఇతర బాడీ గార్డ్ ల కంటే ఎక్కువ వేతనం అందుతుంది. అతడి వార్షిక వేతనం 1 కోటి 20 లక్షల రూపాయలట. అంటే దాదాపు ఆయన ప్రతి నెల 10 లక్షల రూపాయలు వేతనంగా పొందుతున్నారని అర్థమవుతోంది.
అయితే అనుష్క శర్మ భారీగా వేతన ఇవ్వడంతోపాటు అతనిని తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారట. గతంలో జీరో సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె తన బాడీ గార్డ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సోనూ తన యజమాని అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా పీపీఈ ధరించి ఎల్లవేళలా సంరక్షణ కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నప్పుడు వారి వెంటే ఉండి కట్టుదిట్టమైన భద్రత అందిస్తుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: