'బంగార్రాజు' ముహూర్తం ఖరారు..!

Pulgam Srinivas
కింగ్ నాగార్జున హీరోగా లావణ్య త్రిపాటి, రమ్యకృష్ణ హీరోయిన్లు గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016 వ సంవత్సరం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన' ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఉద్దేశ్యంలో నాగర్జున ఎప్పటి నుండో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కబోయే చిత్రానికి 'బంగార్రాజు' అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. 'సోగ్గాడే చిన్ని నాయన' కు సీక్వెల్ గా తెరకెక్కనున్న 'బంగార్రాజు' సినిమా ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 25 వ తేదీ నుండి మొదలవుతుంది. 'సోగ్గాడే చిన్నినాయన'  సినిమాలో హీరోగా నటించిన నాగార్జున  'బంగార్రాజు' సినిమాలో కూడా హీరోగా కనిపించబోతున్నాడు.

అక్కినేని నాగచైతన్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని రెండు ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతున్నట్లు , అందులో స్వర్గం సెట్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా లో చనిపోయిన బంగార్రాజు ఆత్మ రాము శరీరంలో  ప్రవేశిస్తుంది. మరి ఈ సినిమాలో కథ ఎలా సాగుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' సినిమా మరియు బాలీవుడ్  సినిమా అయిన 'లాల్ సింగ్ ఛాద్దా' షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: