మనీషా కొయిరాలా ఒక పోరాట యోధురాలు... జీవితమే పోరాటం

Vimalatha
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఈరోజు తన 51వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 90 దశకంలో మనీషా కొయిరాలా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అప్పట్లో ఆమె కోసం అభిమానులు రక్తంతో ప్రేమ లేఖలు రాసే వారు. ఆమె అందం, అభినయం పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం పోరాటంగానే నిలిచింది. జీవితం అంతా మానసికంగా, ఆరోగ్యపరంగా పోరాడి గెలిచిన యోధురాలు. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.
ఆగస్టు 16 1930లో జన్మించిన మనీషా రాజకీయ నేపథ్యంలో ఫ్యామిలీ నుంచి వచ్చింది. అప్పట్లో మనీషా తాత విశ్వప్రసాద్ కోయిరాల నేపాల్ ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఆమె తండ్రి కూడా రాజకీయ నేత. 1989లో నేపాలి చిత్రం "ఫెరి బేతులేస్" అనే చిత్రంతో మనీషా సినీ జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఆమె ఎప్పుడూ నటి కావాలి అనుకోలేదట డాక్టర్ కావాలనేది ఆమె కల. అనుకోకుండా ఆమెకు మోడలింగ్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత మనీషాకు సినీ పరిశ్రమ పై ఆసక్తి పెరిగింది. మొత్తానికి అలా "సౌదాగర్" సినిమాతో 1991లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత మనీషాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మనీషా తన సినీ కెరీర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో పని చేసింది. "బొంబాయి", "దిల్ సే" వంటి అనేక చిరస్మరణీయ చిత్రాలు చేసింది. అంతేకాకుండా ఆ చిత్రంలో ఆమె అభినయానికి, నటనకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభించాయి. తెలుగులో "భారతీయుడు", "క్రిమినల్" చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా మెప్పించింది. "నగరం" అనే తెలుగు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో చిందేసింది.
ఫుల్ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో మనీషా పూర్తిగా డ్రగ్స్ కు బానిసయ్యింది. దీంతో ఆమె క్యాన్సర్‌కు కారణమైంది. అప్పటి నుండి ఆమెను సినిమా ప్రపంచం దూరం పెట్టింది. 2010లో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను మనీషా కొయిరాలా పెళ్లాడింది. కానీ ఆమె వైవాహిక జీవితం ఎక్కువ రోజులు సాగలేదు. ఆ ఆనందం రెండేళ్లకే ముగిసింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె జీవితంలోకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ప్రవేశించింది. 2012లో ఆమె క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంది. క్యాన్సర్ నుంచి విజయవంతంగా బయటపడగలిగింది. ఆ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన "సంజూ" చిత్రం మనీషా కోయిరాల రీ ఎంట్రీ మూవీ. ఈ సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ పాత్రలో నటించింది. ఇప్పటికి అంతే ఉత్సాహంగా సినిమాల్లో నటించడానికి ఆమె ఆసక్తిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: