ఆ విషయంలో బాలయ్య, నాని సేమ్ టూ సేమ్..?

Anilkumar
సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోల సినిమాల విషయంలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏ హీరో అయినా  తాను నటించిన రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయడానికి సిద్ధపడడు.ఎందుకంటే ఓకే రోజు ఓకే హీరోకి సంబంధించిన రెండు సినిమాలు విడుదలైతే అవి కచ్చితంగా కలెక్షన్స్ పై గట్టి ప్రభావాన్ని చూపుతాయి.అయితే ఓ ఇద్దరు హీరోలు మాత్రం వాళ్ళు నటించిన రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేసారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు 1993 వ సంవత్సరం సెప్టెంబర్ 13 వ తేదీన విడుదలయ్యాయి.

యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై బాలకృష్ణ నిర్మాతగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పు రవ్వ సినిమా తెరకెక్కింది.విజయ శాంతి, శోభన హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకి ఏకంగా నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు.కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు విడుదలైన రోజే నిప్పు రవ్వ కూడా విడుదలైంది.ఇక ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు మంచి కలెక్షన్స్ సాధిస్తే.. నిప్పు రవ్వ మాత్రం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక మరో యంగ్ హీరో మన న్యాచురల్ స్టార్ నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం,జెండా పై కపిరాజు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కాగా అందులో ఎవడే సుబ్రహ్మణ్యం సూపర్ హిట్ గా నిలిస్తే..జెండాపై కపిరాజు మాత్రం ప్లాప్ ని మూటగట్టుకుంది.సో మొత్తానికి అప్పట్లో 1993 లో బాలయ్య తను నటించిన రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తే.. మళ్ళీ 2015 లో నాని కూడా తన రెండు సినిమాలని ఒకే రోజు విడుదల చేశాడు.ఇలా బాలయ్య, నాని కెరీర్లో ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేయడం అనేది ఒక రేర్ ఫీట్ అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: