ఆ హీరో నన్ను డైరెక్షన్ చేయనివ్వలేదు..సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌నం ?

VUYYURU SUBHASH
ఇటీవల కాలంలో రేలంగి నరసింహారావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన రేలంగి వెంకట్రామయ్య కు  తమ్ముడు వరస అవుతాడు. ఇకపోతే రేలంగి నరసింహారావు ఇటీవల ఆలీ నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా అనే షో కి వచ్చి, తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక ఆ షో లో  ఆయన  చెప్పిన మాటలు.. ప్రస్తుతం ఒక్కో మాట వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రేలంగి నరసింహారావును ఒక ప్రముఖ హీరో దర్శకత్వం చేయవద్దని చెప్పారట. ఇక ఆ హీరో ఎవరు..? ఎందుకు అలా చెప్పాడు..? అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఇక అసలు విషయానికొస్తే, అప్పట్లో చలం హీరోగా వచ్చిన సినిమా..పెళ్లి చేసి చూపిస్తా.. చలం అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ఒక స్టార్ హీరో గా కొనసాగుతున్న సమయంలో,  అనుకోకుండా ఆయన స్టార్ స్టేటస్ పడిపోయింది. ఇక ఎవరూ  కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. కాని మన్నళ్‌కైర్‌ అనే ఒక తమిళ్ కామెడీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడు చలం. ఆ నేపథ్యంలోనే రేలంగి నరసింహారావును  దర్శకుడిగా నియమించుకున్నారట.

రేలంగి మాట్లడుతూ..అయితే ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా, వారిని మెప్పించే విధంగా రాజశ్రీ అలాగే చలం కథను మార్చడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు సినిమాకు కావాల్సిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. నన్ను దర్శకుడిగా చేయమన్నారే  తప్ప , నన్ను ఏ పనికి కూడా పిలవడం లేదు. ఇక మానసికంగా కూడా నాకు ఏదోలా అనిపించింది. తెల్లవారితే షూటింగ్ మొదలుపెడతారు అనుకున్న సమయంలోనే, చలం నా దగ్గరికి వచ్చి ఏవండి..రేపు షూటింగ్ మొదలు పెడదాము అని చెప్పాడు. అంతేకాదు సీన్స్ మొదలు పెట్టాలి అని చెప్పడంతో ఏ సీన్ మొదలుపెట్టాలో కూడా నాతో ఏమి డిస్కషన్ చేయలేదు.
పైగా ఒక హీరో , దర్శకుడిని ఏ సీన్  చేయబోతున్నారు అని అడగాలి, కానీ ఇక్కడ అంతా విరుద్ధం.. ఆయన నేను ఏం చేయాలో చెబుతున్నాడు.. ఉదయాన్నే ఐదు గంటలకు కార్ వస్తుంది.. మీరు ఎడిటింగ్ రూమ్ కి వెళ్లి షాట్ డివిజన్ చేసుకోండి అని చెప్పారు. షాట్ డివిజన్ ఎందుకండి.. మనకు కావలసినట్టుగా షాట్ ను రెడీ చేసుకోవచ్చు కదా..! అని చెప్పాను. కానీ ఆయన నేను చెప్పింది చెయ్యండి అంటూ గట్టిగా అరిచారు. ఇక మొదట చలం గారు నాతో మాట్లాడినప్పటికీ , ఇప్పటికీ గొంతులో చాలా తేడా వచ్చింది.
అంతేకాదు ఎప్పుడు క్లాప్ చెప్పాలి..? ఎప్పుడు యాక్షన్ చెప్పాలి..? ఎప్పుడు కట్ చెప్పాలి..?  అనేది కూడా అన్ని ఆయనే వివరిస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదని అన్నాను నేను..కానీ చలం నా దగ్గర పని చేయాలంటే నా సినిమాలో ఇవే ఉంటాయి.. నేను చెప్పిందే చేయాలి అని అన్నాడు.. అందుకు  నేను సారీ సర్ ..నేను చేయలేను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్పాడు రేలంగి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: