రవి తేజ ఎన్ని సినిమాలు రిజెక్ట్ చేశాడో తెలుసా .. అవి కూడా చేసుంటే ?

Mamatha Reddy
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్టార్ హీరోగా రాణింస్తున్న వ్యక్తి రవితేజ. అయన సినీ జీవితంలో అనివార్య కారణాల కారణంగా వదిలేసుకున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కథను శ్రీనువైట్ల ముందుగా రవితేజకు చెప్పారు. అయితే రవితేజ వేరే సినిమాలో బిజీగా ఉండటంతో ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.
రొమాంటిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ఆర్య. అయితే సుకుమార్ ఈ సినిమా స్టోరీని అల్లు అర్జున్ కంటే ముందు చాలా మందికి చెప్పారు. అందులో రవితేజ కూడా ఉన్నారు. ఆయనకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా.. ఈ సినిమా స్టోరీని రవితేజకు చెప్పారు. అప్పటికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని వదులుకున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. శేఖర్ కమ్ముల ఈ సినిమాని రవితేజతోనే ప్లాన్ చేశారు. అయితే  రవితేజకి రాజమౌళితో సినిమా అవకాశం రావడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక  సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమైన కందిరీగ సినిమా కథను ముందుగా రవితేజకు చెప్పారు. రవితేజ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీని వదులుకున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ ఈ సినిమాని మాస్ మహారాజాతో చేయాలని అనుకున్నారు. అనివార్య కారణాలతో ఈ సినిమాకి రిజెక్ట్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వేంకటేశ హీరోగా నటించిన సినిమా బాడీగార్డ్. ఈ సినిమాను కూడా రవితేజ వదులుకున్నారు. అంతేకాక.. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ, నాని నటించిన ఎంసిఏ, ప్రస్తుతం శర్వానంద్ నటిస్తున్న మహా సముద్రం వంటి సినిమాలను ఆయన రిజెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: