హన్సిక గురించి తెలియని కొన్ని నిజాలు..

Divya
దేశముదురు సినిమాలో యాపిల్ పండులా మెరిసిపోతూ కనిపించిన ఉత్తరాది భామ హన్సిక. అల్లు అర్జున్ తో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ మూవీ దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక సినిమాలో తన లేలేత అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ రోజు ఆమె పుట్టిన రోజు కావున ఆమె గురించి మరికొన్ని విశేషాలు చూద్దాం.
ఇక ఆ తర్వాత కంత్రి, మస్కా వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ లతో సమానంగా ఎదిగింది హన్సిక. ఇక రామ్ తో కలిసి కందిరీగ సినిమా తో ఈమె బాగా మంచి హీరోయిన్ గా పాపులర్ అయింది. ప్రస్తుతానికి తమిళంలో కూడా టాప్ హీరోయిన్ రేంజ్ లో ఈమె కొనసాగుతోంది. కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో ఈమె కూడా ఒకరు అన్నట్లు తెలుస్తున్నది.
హన్సిక ముంబై ప్రాంతంలో జన్మించింది. ఇక ఈమె తండ్రి ప్రదీప్ మోత్వాని, తల్లి మోనా మోత్వాని
హన్సిక తండ్రి బిజినెస్ చేసేవాడు.తల్లి చర్మ సంబంధిత వ్యాధి నివారణలో నిపుణులు. ఈమెకు ప్రశాంత్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు. హన్సిక తన చదువుకునే వయసులోనే మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక కోలీవుడ్ లో మొదటి మూవీ"మా పెళ్లయి "అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ మూవీ సూపర్ హిట్ అవడంతో ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.అలా ఎంట్రీ ఇచ్చిన హన్సిక అక్కడ అభిమానులతో గుడి కట్టించుకునే స్థాయికి ఎదిగిపోయింది. ఇక కుష్బూ లాంటి హీరోయిన్ తర్వాత గుడి కట్టించుకుని ప్రేక్షక ఆదరణ పొందిన  హీరోయిన్ హన్సికనే  అని చెప్ప వచ్చు.
ఇక ప్రస్తుతానికి ఈమె హాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె గురించి ఒక వార్త ఎక్కువగా వినిపిస్తోంది..ఆ విషయం ఏమిటంటే , తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఈమె తన సొంత డబ్బులతో  25 మంది అనాధ పిల్లలను చదివిస్తోంది. ఇక అంతే కాకుండా ఎంతో మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న అటువంటి 10 మంది మహిళలకు లక్షలు ఖర్చు పెట్టి సహాయం చేస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇంతో దయా హృదయం కలిగిన హన్సికకు ప్రేక్షకుల గుడి కట్టించినప్పటికి అది తక్కువే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: