నాగ్ పాన్ ఇండియా సినిమా.. ఎలా మిస్ అయిందంటే?

P.Nishanth Kumar
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు 50 కోట్ల బడ్జెట్ చిత్రాలు చేయడం గగనం అయిపోయిన టాలీవుడ్ లో ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి.  బాహుబలి దగ్గర్నుంచి ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మొదలు కాగా కొత్తగా వచ్చిన హీరోలు సైతం ఈ తరహా సినిమాలు చేసి స్థిరపడాలని చూస్తున్నారు.

ఏదో ఒక భాషకే పరిమితం కాకుండా బహు భాషల్లో ఒకేసారి సినిమా తీసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసి  మంచి క్రేజ్ దక్కించుకోవాలని మన హీరోలు భావిస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం మన టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లు చేస్తున్నారు. అయితే 90ల్లో హిందీ సినిమాలు వరుసగా చేస్తున్న అక్కినేని నాగార్జున అప్పట్లోనే ఓ పాన్ ఇండియా మూవీలో నటించాల్సి ఉండగా అది అనుకోకుండా రద్దు అయిందట. ఆ సినిమా కోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాక ఆ చిత్రాన్ని ఆపేశారని సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కె.ఎల్.నారాయణ తో కలిసి గోపాల్ రెడ్డి గతంలో ఎన్నో సినిమాలను నిర్మించారు. ఆ విధంగా ఆ బ్యానర్లో నాగార్జున హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నారట. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన అద్భుతమైన స్క్రిప్ట్ అది.  48 గంటలలో ముగిసిపోయే మంచి ఆసక్తికరమైన కథ.  ఎంతో బాగా ఉందట. తనకు విషం ఎక్కించిన ముగ్గురు విలన్ లను హీరో చంపాలి.ఒక్కో విలన్ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని చంపే క్రమంలో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో నటించేందుకు అప్పట్లో పెద్ద పెద్ద వారిని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. సినిమా ప్రారంభం కావాల్సిన సమయం లో కొన్ని సన్నివేశాల్లో మార్పు చేస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఈ విషయం అశోక్ మెహతా చెప్పగా ఆయన ససేమిరా అన్నారు. దాంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: