అల్లు అరవింద్ తలుచుకుంటే ఎంత మంది తలరాతలు మరిపోతాయో తెలుసా ?

Mamatha Reddy
టాలీవుడ్ లో కొంతమంది సినీ పెద్దలు ఇండస్ట్రీలోని ప్రతి విషయాన్ని శాసిస్తు ఉంటారు. ఏ పెద్ద విషయం జరిగిన తమ అనుమతి, తమ అంగీకారం ఉంటేనే ఇండస్ట్రీలో అమలు అవుతూ ఉంటుంది.అలా ఓ నాలుగు వ్యక్తులు పరిశ్రమ లో ప్రముఖంగా ఉన్నారు అని చెప్పవచ్చు. వారిలో ఒకరు మెగా ప్రొడ్యూసర్ గా పెద్ద పెద్ద సినిమాలను చేస్తూ భారీ లాభాలను అందుకుంటున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సాయి ధరంతేజ్ వరకు ప్రతి ఒక్కరికి విజయాన్ని అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత ఈ అల్లుఅరవింద్.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన నాలుగు సినిమాలు నిర్మించింది అల్లు అరవింద్ కావడం విశేషం.  ఈ మెగా ప్రొడ్యూసర్ టాలీవుడ్ లోని ప్రతి ఒక్క హీరోతో సినిమా చేయడమే కాకుండా వారికి మరుపురాని హిట్ లను సైతం అందించాడు. అల్లు అరవింద్ సారథ్యంలో ఈ గీతా ఆర్ట్స్ లో  టాలీవుడ్ కు చెందిన పెద్ద పెద్ద సినిమాలే కాకుండా ఇతర భాషల్లో సినిమాలను కూడా ఇక్కడ రైట్స్ తీసుకొని విడుదల చేస్తూ ఉంటారు.

సూర్య హీరోగా నటించిన గజిని మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో టాలీవుడ్ లో విడుదల కాగా అది ఆల్ టైం హిట్ గా నిలిచి రికార్డ్ లను సృష్టించింది.  సూపర్ స్టార్  రజనీకాంత్ హీరోగా నటించిన ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన మా పిల్లై సినిమా సూపర్ హిట్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా కూడా ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా. రాజమౌళి దర్శకత్వంలో భారీ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పాన్ ఇండియా మార్కెట్ ను బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది.  అల్లు అర్జున్ అలా వైకుంటపురం, విజయ్ దేవరకొండ గీతాగోవిందం, నాని బలే బలే మగాడివోయ్, నాగచైతన్య 100% లవ్, సాయి ధరంతేజ్ ప్రతి రోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమా లు ఈ సంస్థ నుంచి మర్చిపోలేని సినిమాలు గా అల్లు అరవింద్ ప్రేక్షకులకు అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: