రాశిఖన్నా అగ్రతార కావడానికి బాగా హెల్ప్ చేసిన సినిమా అదే..?

Suma Kallamadi
హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రాశిఖన్నా మనం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014 సంవత్సరం లో ఊహలు గుసగుసలాడే అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు. శ్రీ సాయి శిరీష ప్రభావతి అనే ఒక సాంప్రదాయమైన అమ్మాయి పాత్రను ఆమె చాలా పోషించారు. ఆమె వెండితెరపై కనిపించిన సమయమంతా కూడా ప్రేక్షకులకు బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ లభించిందంటే అతిశయోక్తి కాదు. ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మనసులను పులకరింప చేశారు.
క్లోజ్ అప్ షాట్స్ లో కూడా ఆమె తన అద్భుతమైన హావభావాలతో ఆశ్చర్య పరిచారు. ఆమె న్యూ యాక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడా కూడా రాదంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రకు శ్రీనివాస్ అవసరాల అద్భుతమైన డైలాగులు రాశారు. దీంతో ఈ సినిమా మొత్తం కూడా రాశిఖన్నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కళ్యాణ్ కొండూరి అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఈ చిత్రాల్లో నటించిన ఆమె బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా అవార్డు కూడా గెలుచుకున్నారు.
నిజానికి రాశి ఖన్నా కెరీర్ లో ఊహలు గుసగుసలాడే సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమా తర్వాతనే ఆమెకు ఎనలేని పాపులారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె టాలీవుడ్ పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు. బెంగాల్ టైగర్, శివమ్, జైలవకుశ,  తొలిప్రేమ, ప్రతి రోజు పండగే సినిమాలతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఇప్పుడు ఆమె చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ఆమెకు ఏ స్థాయిలో స్టార్డమ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తున్నారు.
అయితే ఆమెకు ఊహలు గుసగుసలాడే సినిమా అగ్రతారగా ఎదిగేందుకు బాగా దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా వచ్చిన పాపులారిటీని ఆమె బాగా సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగారు. నటనలో మాత్రమే కాదు సంగీతంలో కూడా రాశి ఖన్నాకి ప్రవేశం ఉంది. ఆమె ఇప్పటికే ఆరు పాటలు పాడి తెలుగు శ్రోతలను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: