ఉత్తర కొరియా నుంచి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోయిన్

Mamatha Reddy
నటీ నటులకు అవార్డులు రావడం ఎంతో విశేషమైనది. తాము చూపించిన ప్రతిభకు ఏదో ఒక రూపంలో అవార్డు రావడం వారికి ఎంతో ఆనందాన్ని మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ విధంగా మన దేశం నుంచి కాకుండా పక్క దేశం నుంచి అవార్డు అందుకొని ఎంతో పొంగిపోతుంది తెలుగు హీరోయిన్. ఆమె ఎవరో కాదు కృష్ణ శోభన్బాబు కృష్ణంరాజు చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నాయికగా నటించిన గీత. ఒకప్పుడు తెలుగు సినిమాలలో గ్లామర్ హీరోయిన్ గా రాణించి అగ్ర హీరోల సరసన నటించగా ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇతర సినిమాల్లో కనిపిస్తూ మిగతా దక్షిణాది భాషల్లో బిజీ అయిపోయింది గీత.

ఈమె తన కెరియర్ లో అంతర్జాతీయ అవార్డును అందుకోవడం ఎంతో విశేషం అని ఆమె చెప్పుకొచ్చింది. ఆరోజు తనకు మరుపురాని రోజు, మద్రాసులోని ఉత్తరకొరియా కాన్సులేట్ కార్యాలయ అధికారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఉత్తర కొరియాలో ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఇతర దేశాల చలనచిత్రాలతో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం మా దేశంలో ఇదే మొదటిసారి. ఈ విదేశీ చలనచిత్రాల్లో భారతదేశం నుంచి వచ్చిన మలయాళ చిత్రం పంచాగ్ని చూడగా ఆ చిత్రంలో నటించిన మిమ్మల్ని ఉత్తమ నటిగా ఎన్నుకున్నాము. ఈ అవార్డు అందించడానికి ప్రత్యేకంగా ఎలాంటి సభ ఏర్పాటు చేయడం లేదు. అందువల్ల ఆ అవార్డును మీ ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

చెప్పినట్లుగానే ఆమెకు వెండి షీల్డు వచ్చింది. ఒక్కసారిగా ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే ఆమెకు ఉత్తమనటి అవార్డు రావడం ఇదే మొదటిసారి. అందులోనూ పంచాగ్ని గురించి ఆ అవార్డు గురించి ఒక మలయాళ పత్రిక రాసింది.  ఈ సినిమాలో గీత ఎంతో చక్కగా నటించింది అని రాసుకొచ్చారు. అంత బాగా చేసినా ఆమెకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు రాలేదు. అయితే వీటన్నిటికి మించి అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించింది. మన వాళ్ళు గుర్తించలేని మన నటి ప్రతిభను విదేశీయులు గుర్తించారు అని ఆ పత్రిక రాసింది అని వెల్లడించింది.  అదే సంవత్సరం కన్నడ చిత్రం అరుణ రాగ లో ఆమె నటనకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: