ఆ హీరోకు హ్యాండ్ ఇచ్చి మరోక స్టార్ తో చక్కర్లు కొడుతున్న కిమ్ శర్మ

Mamatha Reddy
సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ లు, బ్రేకప్ తర్వాత వేరొకరితో అఫైర్లు కొనసాగించడం హీరో హీరోయిన్ లకు అలవాటే. చాలా మంది ఈ విధంగా ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత వేరే వారితో అనుబంధం కొనసాగిస్తూ తమ జీవితాన్ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తు ఉంటారు. చాలా మంది హీరో హీరోయిన్ లు ఈ విధంగా చేయగా, ముఖ్యంగా హీరోయిన్ లు ఈ విషయంలో ఏమాత్రం బాధ పడ్డారు. ఎప్పుడైతే బ్రేకప్ చెప్పేస్తారో వెంటనే మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తూ తమ గత అనుభవాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.

ఆ విధంగా ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ కిమ్ శర్మ తాజాగా ఓ స్టార్ తో డేటింగ్ చేస్తున్నట్లు ఫోటోలు బయటపడడంతో అది కాస్తా ట్రెండింగ్ గా మారింది. ఆమె లియాండర్ పేస్ తో చాలా రోజుల నుంచి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు రాగా అవి పుకార్లే అని వాదనలు వినిపించాయి కానీ వారు డేటింగ్ లో ఉండగా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరు దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ  లాక్ డౌన్ లో గోవా లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన ఈ లవ్ బర్డ్స్ దిగిన ఫోటోలు వీరు బస చేసిన హోటల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి లీక్ అయ్యాయి. 

 Lదీంతో నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో వీరిద్దరి అన్యోన్యత చూస్తుంటే ఎంతో దగ్గర అయిన్నట్లు కనిపిస్తుది. ఒక ఫోటో లో వీరిద్దరూ కలిసి లంచ్ చేస్తూ ఉండగా ఇంకొక ఫోటో లో కిం ను వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకున్నాడు లియాండర్. గోవా వెకేషన్ కు సంబంధించిన పిక్చర్స్ ను ఈ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఇప్పటి వరకు షేర్ చేయలేదు. కిమ్ మాత్రం సింగిల్ పిక్చర్ షేర్ చేసి  మిస్టర్ పి కి ఈ క్రెడిట్ దక్కుతుందనే క్యాప్షన్ ని ఆడ్ చేసింది. కాగా ఈ పిక్చర్ లో ఉన్న డ్రెస్ హోటల్ షేర్ చేసిన పిక్స్ లో ఉన్న డ్రస్ తో మ్యాచ్ కావడం తో  వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: