"సినిమాల్లో చేస్తే తప్పు లేనిది.. నిజ జీవితంలో చేస్తే తప్పేంటి" : మల్లికా షెరావత్

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మీటూ ఉద్యమం ఎంతటి వివాదాలు, సంచలనాలకు దారి తీసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.మహిళా నటీమణుల విషయంలో సినీ దర్శకులు, నిర్మాతలు,హీరోలు ఇలా ప్రతీ ఒక్కరూ వారిపై చేసిన ఆగడాల గురించి ఎంతో మంది నటీమణులు బయటపెట్టి సంచలనంరేపారు.సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తట్టుకోలేక..చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ కోసం ఒళ్ళు అమ్ముకొని స్టార్ లుగా ఎదిగారని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు.ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ సైతం పంచుకుంది.బాలీవుడ్ లో 2004 లో ఇండ్రస్టీ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మల్లికా..

ఆ తర్వాత పలు బోల్డ్ సినిమాల్లో నటించింది.అంతేకాదు బాలీవుడ్ లో ఈమెకు శృంగార హీరోయిన్ గా కూడా పేరొచ్చింది.ఎక్కువగా రొమాంటిక్ సినిమాల్లోనే నటించి గుర్తింపు తెచ్చుకుంది మల్లికా షెరావత్.అయితే కొంతకాలం తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు రాక.. అనుకున్నంతగా ఈమె కెరీర్ సాగలేదు.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బోల్డ్ హీరోయిన్.. కొన్ని హాట్ కామెంట్స్ చేసింది.ఇండ్రస్టీ లో తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు ఇవ్వలేదని..ఇంకా కొందరు హీరోలైతే తమ కోరికలు తీర్చనందుకు..అవకాశాలు రాకుండా చేసారని తెలిపింది.తెర వెనుక తాము అంగీకరించకపోవడం వల్లనే తనను చాలా సినిమాల నుంచి తీసేసారని చెప్పుకొచ్చింది.

ఇక కెరీర్ లో ముందుకు సాగాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అని తెలిపింది ఈ బోల్డ్ హీరోయిన్. అంతేకాదు సినిమాల్లో బోల్డ్ గా నటించినప్పుడు..నిజ జీవితంలో చేస్తే తప్పేంటని చెప్పింది మల్లికా.. అంతేకాదు ఇదే విషయాన్ని చాలామంది హీరోలు తనకు చెప్పి కమిట్మెంట్స్ ఆడిగేవారని మల్లికా వాపోయింది.ఈ విషయంలో తాను దూరంగా ఉండటం వల్లనే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది.అంతేకాదు ఇప్పటికి కూడా ఇది జరుగుతూనే ఉందని..ఒక హీరోయిన్ తన కెరీర్ లో ఎదగాలన్నా.. తనకు ఎక్కువ సినిమాల్లో అవకాశాలు రావాలన్నా.. కచ్చితంగా హీరోతో గడపవల్సిందేనని చెప్పుకొచ్చింది మల్లికా షెరావత్..ప్రస్తుతం ఈమె చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: