శంకర్, రామ్ చరణ్ ల సినిమా పట్టాలెక్కడానికి కారణం అతనే!!

P.Nishanth Kumar
సౌత్ లోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక పాన్ ఇండియా హీరోగా సెటిల్ అవ్వాలనే దిశలో ఉన్నాడు. అందుకే పెద్ద పెద్ద దర్శకులు లైన్ లో పెట్టుకుంటున్నాడు. అటు శంకర్ కూడా కం బ్యాక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నగర చిత్రాలు ఫ్లాప్ అవుతూ వస్తుండడంతో పాపులారిటీ చాలా తగ్గింది.

అంతేకాకుండా వివాదాల్లో ఇరుక్కోవడం కూడా ఆయనను కృంగి వేశాయి. దీంతో శంకర్ రామ్ చరణ్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇండియన్ 2 వివాదంలో ఉన్న శంకర్ కు చెన్నై కోర్టు క్లియరెన్స్ ఇవ్వగా ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాడట. స్క్రిప్ట్ ఫైనల్ చేయడం, కాస్ట్ అండ్ క్రూ గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నాడట.

ఇటీవలే శంకర్ ని కలిసిన సందర్భంగా ఆయనతో కలిసి చరణ్, దిల్ రాజు దిగిన కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో వీరు ముగ్గురు కాకుండా మరొక వ్యక్తి కూడా ఉండడం మనం గమనించాం. మరి ఆ వ్యక్తి ఎవరా అని ఆరాతీస్తే ఆయన పేరు నరసింహారావు అని తెలిసింది. పేరు చూస్తుంటేనే తెలుగువాడు అని అర్థమైపోతుంది. శంకర్ దగ్గర చాలా ఏళ్లపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడట. శంకర్ తో అతడికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ అనుభవంతోనే దర్శకుడిగా మారి శరభ అనే సినిమా తీశాడు కానీ ఆ సినిమా నిరాశపరిచింది. తర్వాత దిల్ రాజు కాంపౌండ్ లో నరసింహ రాజు వివి వినాయక్ తో శీనయ్య అనే సినిమాను మొదలు పెట్టాడు. అది ఆగిపోయింది.ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ సినిమా ఓకే అవడానికి నరసింహారావు హస్తం చాలా ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: