మంచు విష్ణు - వెరోనికాది ప్రేమ వివాహం కాదా... ఇంత క‌థ న‌డిచిందా ?

Divya
మంచు వార‌బ్బాయి మంచు విష్ణు , వైఎస్ ఫ్యామిలీకి చెందిన వెరోనికా రెడ్డి ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంప‌తుల‌కు న‌లుగురు పిల్ల‌లు. అయితే వీరిది ప్రేమ వివాహం అనే ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది అనుకుంటారు. విష్ణు - వెరోనిక కూడా పలు ఇంటర్వ్యూలలో తమ‌ది ప్రేమ వివాహం అని చెప్పుకున్నారు. విష్ణు ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో వెరోనికాను చూసి ఇష్టపడటం తర్వాత కొద్దిరోజులకు ఇద్దరి మనసులు కలవడంతో వీరి మధ్య ప్రేమ చిగురించి చివరకు పెళ్లి వరకు వెళ్ళింది. అయితే ఈ దంపతుల ది ప్రేమవివాహం మాత్రమే కాదని వైయస్ రాజశేఖర రెడ్డి - మోహన్ బాబు ఢిల్లీ సాక్షిగా కుదిర్చిన మ్యారేజ్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
1996లో క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు టిడిపి నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1994లో ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ అప్పట్లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి ఒక‌రిని రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మోహన్ బాబును రాజ్యసభకు ఎంపిక చేశారు. మోహన్ బాబు ఢిల్లీలో ఉన్న క్రమంలో... అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కడప ఎంపీగా ఉన్నారు. వీరిద్దరు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అప్పటి నుంచే వీరిద్దరూ తమ రెండు ఫ్యామిలీల మధ్య బంధుత్వం కలుపుకోవాలని ఆరాటపడేవారు. అలా ముందుగా వైఎస్ - మోహన్ బాబు మధ్య వెరోనికా - విష్ణు పెళ్లిపై  చర్చ జరగగా... ఆ తర్వాత విష్ణు - వెరోనికా ముందుగా పరిచయం పెంచుకుని తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని కొంతమంది చెబుతూ ఉంటారు.
ఇక విష్ణు వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం క‌లుపుకున్న వేళ క‌ట్నంగా కోట్లాది రూపాయ‌లు వ‌చ్చాయ‌ట‌. లిక్విడ్ క్యాష్‌.. అది కూడా వైట్ మ‌నీయే ఏకంగా రు. 500 కోట్లు ఇచ్చార‌ని టాక్ ?  ఇక హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల కొన్ని ప్లాట్లు, విల్లాలు కూడా క‌ట్నంగా వ‌చ్చాయ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: