అలుపెరగని అలల కెరటం ఊర్వ'శి' శారద జీవితం

Mamatha Reddy
తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హీరోయిన్ లు తమ తమ టాలెంట్ తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ అలనాటి తారలు కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తూ నటన పై వారికున్న ప్యాషన్ ను తెలియజేస్తున్నారు. అలా సినిమాలను ఇష్టపడే నటీమణులలో ఒకరు ఊర్వశి శారద. 350కి పైగా చిత్రాల్లో నటించిన శారద తన కెరీర్ లో మూడు సార్లు ఊర్వశి అవార్డు పొందడం ఒక రికార్డు. ఈ క్రమంలో ఆమె ఆ అవార్డు కే వన్నె తెచ్చారు అనడం అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి మలయాళంలో ఆమె కోసమే కొన్ని సినిమాలు తీసి ఆమెలోని ప్రతిభను ప్రేక్షకుల ముందు ఉంచారని కూడా చాలామంది అంటూ ఉంటారు.

తెలుగులో తొలుత నటించిన తర్వాత మలయాళ సినీ రంగంలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకుని గుర్తింపు పొందినప్పుడు మన వాళ్ళు కళ్ళు తెరిచి శారదకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. చిన్న వయసులోనే మద్రాసు చేరుకున్న శారదా బామ్మ కనకమ్మ దగ్గర పెరిగారు. తన బామ్మ స్ట్రిక్ట్ గా ఉండేవారని క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని శారద చెప్పేవారు. ఆదివారం మాత్రమే రిహార్సల్సు ఉండేవి. తొలి రోజుల్లో హీరోలు ఎవరూ ఆమెను తాకడానికి బామ్మ ఒప్పుకునేవారు కాదు.

తన ఆరవ యేటనే డ్యాన్సు నేర్చుకున్నారు శారద. దసరా పండుగ రోజుల్లోనూ,ఆలయ ఉత్సవాలలోనూ ఆమె డాన్స్ చేసే వారు. ఆమె తల్లి కోరిక గా డాన్స్ నేర్చుకున్నారు శారద. తమ కూతురు సినిమా ల్లో గొప్ప స్టార్ కావాలనేది  కూడా శారద తల్లి కోరికనే. ప్రముఖ హీరో చలం ను శారద పెళ్లి చేసుకున్నారు. చలం నిర్మాతగా, కమెడియన్ గా కూడా చేశారు. శారద నటించిన తొలి సినిమా తండ్రులు కొడుకులు.. ఈ చిత్రంలో తన సహ నటుడు చలం. అలా వీరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. అయితే ఆ తర్వాత వీరు విడిపోయారు. పద్మనాభం చిత్రం లో చేసి అందరూ శారదా హాస్యపాత్రలు కూడా సరిపోతుంది అని అనుకున్నారు. అలా సినిమా పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ గా ఎదిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: