తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్ల వార్ లో పోటీ పడుతున్న హీరోలు వీరే

Mamatha Reddy
టాలీవుడ్ లో ప్రస్తుతం పా న్ ఇండియా సినిమాల జోరు నడుస్తోం ది. టాలీవుడ్ హీరో లు అందరూ చేస్తే పాన్ ఇండియా సినిమా నే చేయాల ని పట్టుబడుతున్నారు. దాంతో నిర్మాతలు తప్పక ఆ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్న హీరోలందరూ ఈ సినిమాలే చేస్తున్నారు. కొత్త పాత హీరో ల మధ్య ఈ తరహా కాంపిటేషన్ రసవత్తరం గా ఉంటుంది. ఇక సెకండ్ రో లో ఉన్న హీరోలు మాత్రం వంద కోట్ల క్లబ్ లో ప్లేస్ కోసం ఆరాటపడుతున్నారు. 

నేచురల్ స్టార్ నాని ని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన ఈగ సినిమా తరువాత ఆ రేంజ్ కమర్షియల్ హిట్ నానికి ఇంతవరకు లేదు. ఆయన తర్వాత వచ్చిన విజయ్ దేవరకొం డ లాంటి హీరో 100 కోట్ల క్లబ్లో ఇప్పటికే చేరగా నాని లాంటి సీనియర్ హీరో ఆ ఘనతను ఇంతవరకు దక్కించుకోలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సెంచరీ కొట్టింది అంటే మామూ లు విషయం కాదు. 

ఇదిలా ఉంటే రెగ్యులర్ గా  30 కోట్లకు మించి లేని కథానాయకులంతా సెంచరీ ఛాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తో తన మార్కెట్ ను ముప్పై రెండు కోట్లకు పెంచుకున్న సాయిధరమ్ తేజ్, వరుస హిట్లతో 30 కోట్ల మార్కెట్ ను సంపాదించుకున్న వరుణ్ తేజ్, మజిలీ తో సూపర్ హిట్ కొట్టి 37 కోట్ల మార్కెట్ ను పెంచుకున్న నాగచైతన్య, ఇస్మార్ట్ శంకర్ తో రామ్, భీష్మ తో నితిన్, క్రాక్ తో రవితేజ ఇలా అందరూ వంద కోట్ల పై పరుగులు తీస్తున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: