ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధించిన అవార్డ్స్ ఇవే..?

Suma Kallamadi
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆయన సినీ జీవితంలో ఎన్ని అవార్డులు గెలుచుకున్నారో తెలుసుకుందాం. బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , ప్రొడ్యూసర్ గా కూడా అవార్డులు గెలుచుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం బాలుని ప‌ద్మ శ్రీతో పురస్కారంతో స‌త్క‌రించింది. 2011లో ఆయ‌న‌కు ప‌ద్మ భూష‌ణ్ పురస్కారం కూడా లభించింది. 2021లో ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది.


శంకరాభరణం(1979) సినిమాలోని "ఓంకారా నాధను" పాట ఆలపించిన ఎస్పీ బాలు కు జాతీయ పురస్కారం లభించింది. 'ఏక్ దూజేకే లియే(1981) సినిమాలో "తేరే మేరే బీచ్ మెయిన్" హిందీ పాట ఆలపించినందుకు గాను ఆయనకు మరొక జాతీయ పురస్కారం కూడా లభించింది. 1983 సాగర సంగమం సినిమాలో "వేదం అనువణువున" పాట అద్భుతంగా పాడి మరొక నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.


రుద్రవీణ(1988) లో " చెప్పాలని ఉంది" పాట కూడా ఆయనకు నేషనల్ పురస్కారం తెచ్చి పెట్టింది. తమిళం మూవీ మిన్సారా కనవు(1996) లోని "తంగా తమరై" అతి మధురంగా పాడినందుకు గాను బాలుపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు ఆయనకు జాతీయ పురస్కారం కూడా లభించింది. కన్నడలో తెరకెక్కిన ‘సంగీత సాగర గాన యోగి పంచాక్షర గవై’ అనే సినిమాలోని పాటలకు ఐదో సారి జాతీయ అవార్డు అందుకున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి 4 భాషల్లో కలిపి బాలు 6 జాతీయ ఉత్తమ గాయకుడిగా పురస్కారాలు అందుకుని ఆశ్చర్యపరిచారు.


పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999) నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా డాక్టరేటు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం 1981లో ఆయనను కలైమామణి అవార్డుతో గౌరవించింది. 2009లో చెన్నైలోని ‘సత్యభామ యూనివర్సిటీ’ బాలసుబ్రహ్మణ్యం గానామృతానికి ఫిదా అయిపోయి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయనకు లెక్కలేనన్ని అవార్డులు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: