18 పేజిస్ కథ ఆ సినిమా కాపీయేనా?

NIKHIL VINAY
'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా '18 పేజెస్'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. జూన్ 1న నిఖిల్ పుటిన రోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. 

అయితే ఈ ఫస్ట్ లుక్ తో సినిమా మీద మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో సిద్ధు పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్.. నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించబోతున్నారని తెలిపారు. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు.''నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది'' అని ఆ పేపర్‌పై రాసి ఉండటం సినిమా పట్ల ఆసక్తి తో పాటు అనుమానాలు కూడా పెంచింది.

ఈ పోస్టర్స్ అన్ని చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన ప్రియమైన నీకు సినిమాల కనిపిస్తుంది అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని సుకుమార్ కాపీ కొట్టారా లేదా అనేది మనకు సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.ఇక అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: