టాలీవుడ్ లో భారీ నష్టాలని మిగిల్చిన 10 సినిమాలు

Mamatha Reddy
టాలీవుడ్ లో అప్పుడప్పుడు హీరోలు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ గా మిగిలిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పెద్ద హీరోలు సైతం దీనికి అతీతులు కాదు. చాలా సందర్భాల్లో వారు వారి తప్పులు తెలుసుకొని మళ్లీ ఆ తప్పులను పునరావృతం చేయకుండా సినిమాలు చేసి హిట్లు కొట్టారు కాబట్టే వారు స్టార్ హీరోగా ఎదిగారు. మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు మన హీరోల కెరియర్లో భారీ డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు, నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అ పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాలను హిట్ చేస్తారు. మొదటి రోజే ఈ సినిమా బడ్జెట్ మొత్తం వచ్చేలా రిపీటెడ్ గా సినిమాను తీలకిస్తారు. అంతటి ఫ్యాన్ వేసుకున్నా పవన్ కళ్యాణ్ ఓ సినిమా వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సినిమానే అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 25వ సినిమా న భూతో న భవిష్యత్ అనేలా ఫ్లాపయి దాదాపు 55 కోట్లకు పైగా నష్టం తీసుకువచ్చింది. మహేష్ బాబు కెరీర్లో 40 కోట్ల రూపాయల వరకు నష్టం తీసుకొచ్చిన సినిమా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం. ఈ సినిమా దెబ్బకు ఇప్పటివరకు కోలుకోలేక పోయారు శ్రీకాంత్.
మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి సినిమా నష్టాలు నుంచి బయటపడడానికి అశ్వినీదత్ లాంటి అగ్ర నిర్మాత కూడా ఏడేళ్లు పట్టింది అంటే ఆ సినిమా ఎంత పెద్ద షాక్ ఇచ్చినదో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో తుఫాన్ సినిమా అత్యంత భారీ డిజాస్టర్ గా ఆయన కెరీర్లో మిగిలిపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన సినిమా రెబల్. బాలకృష్ణ ఒక్క మగాడు సినిమాతో దారుణంగా నష్టాలను కూడా తెచ్చుకున్నాడు. మహేష్ స్పైడర్, వెంకటేష్ షాడో, బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, నాగార్జున మన్మధుడు 2, పవన్ కళ్యాణ్ కొమరం పులి , అక్కినేని అఖిల్ అఖిల్, సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ వంటి చిత్రాలు దాదాపు 90 శాతం నష్టాలను మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: