సోనూ సూద్ లోని ఆనాటి రహస్యాన్ని బయటపెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ !

Seetha Sailaja
ప్రస్తుతం సోనూ సూద్ నేషనల్ సెలెబ్రెటీ. కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో అనేకమందికి ఈ బాలీవుడ్ నటుడు అందిస్తున్న సహాయ సహకారాల పై ప్రశంసలు కురిపించని వ్యక్తి లేడు. అంతర్జాతీయ టైమ్ మ్యాగజిన్ లో సోనూ సూద్ పై ఒక ఆసక్తికర కథనం ప్రచురింపబడే స్థాయికి అతడు ఎదగడం అందర్నీ ఆశ్చర్య పడుతున్న విషయం.

వాస్తవానికి ఈ బాలీవుడ్ నటుడు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న గొప్ప సెలెబ్రెటీల లిస్టు లో లేడు. ఇతడికన్నా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న టాప్ హీరోలు ఎందరో వేలకోట్ల సంపాదనపరులుగా కొనసాగుతున్నారు. అయితే సోనూ సూద్ తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి కోవిడ్ బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాలతో సోనూ కేవలం ఒక్క సంవత్సర కాలంలో నేషనల్ సెలెబ్రెటీ గా మారిపోయాడు.

ఇలాంటి వ్యక్తి గురించి నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. దాదాపు 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్ తాను ఒక సామాజిక సేవాకార్యక్రమానికి అతిధిగా పిలవడానికి వెళ్ళినప్పుడు తనకు ఎదురైన ఒక  విచిత్రమైన అనుభవాన్ని తమ్మారెడ్డి బయటపెట్టాడు.

 వికలాంగుల సహాయం కోసం ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమానికి అప్పట్లో తాను సోనూ సూద్ ను అతిధిగా పిలిచినప్పుడు అతడు తనకు సామాజిక కార్యకలాపాల పై పెద్దగా ఆశక్తి లేదని చెపుతూ అయినప్పటికీ తాను ఆ కార్యక్రమానికి అతిధిగా రావాలి అంటే తనకు పారితోషికంగా ఎంత ఇస్తారని అడిగినప్పుడు అప్పట్లో తనకు సోనూ సూద్ చాల కమర్షియల్ వ్యక్తిగా అనిపించాడని అప్పటి విషయాలను బయటపెట్టాడు. అయితే అలాంటి సోనూ సూద్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి ప్రజలకు తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ఈ విషయాలలో సోనూ సూద్ ను ప్రభావితం చేసిన ఎదో ఒక శక్తి ఉంది అని భరద్వాజ అభిప్రాయ పడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: