కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

VAMSI
తెలుగు సినీ పరిశ్రమలో ఏదో సాధించాలని ఎంతో మంది కుర్ర దర్శకులు చిత్ర పురికి వస్తుంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. దీనికి విభిన్న కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీరి టాలెంట్ నిరూపించుకోవడానికి ఎవ్వరైనా అవకాశం ఇవ్వాలి. లేదంటే జీవితాంతం అవకాశాల కోసం తిరుగుతూ కాలం గడిపేయాల్సిందే. కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ చాలా మారింది. మంచి పేరున్నా లేకపోయినా సత్తా ఉన్న వారికి అగ్ర తాంబూలం అందుతోంది. అంటే అదేనండి యువ దర్శకులకు సైతం అవకాశాలు ఇచ్చేవారు పెరిగారన్న మాట. అలాంటి అతి తక్కువ మంది నిర్మాతలలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. ఈయన కొత్త వారైనా వారిలో టాలెంట్ ఉంటే తప్పక అవకాశం ఇస్తారు.
ఈ విధంగా యువకులను ప్రోత్సహించడానికి రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ ను స్థాపించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు వీరి ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన విద్యార్థిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే కోర్స్ పూర్తి చేసిన సతీష్ అనే ఒక యువకుడిని దర్శకుడిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సతీష్ ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి తెలుగులో ఇటువంటి కాన్సెప్ట్ తో సినిమా తీయలేదట. కానీ దీనికి సంబంధించిన మిగతా వివరాలు ఏవీ ఇంకా ప్రకటించలేదు.
ఈ సినిమాలో హీరోగా దగ్గుబాటి వారినే తీసుకుంటారా లేదా బయట ఎవరైనా హీరోనా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సురేష్ మూడు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఒకటి వెంకటేష్ నటిస్తున్న తమిళ్ అసురన్ మూవీ కి రీమేక్ నారప్ప, ఇంకొకటి మలయాళ దృశ్యం సీక్వెల్ మూవీ. ఇవి కాకుండా రానా నటిస్తున్న విరాటపర్వం సినిమా. ఇవన్నీ కరోనా కారణంగా విడుదల కాకుండా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటి విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: