మణిరత్నం సినీ జర్నీలో కీలకమైన అంశాలు ఇవే.

Divya

మణిరత్నం సినిమాలు అంటే మంచి కథ, కథనం తో కూడుకొని వుంటాయి. ముఖ్యంగా ఈయన  సినిమాలంటే  తెలుగు, తమిళ రాష్ట్రాలలోని ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. ఈయన చిత్రాలు దాదాపుగా ఎలా ఉంటాయి అంటే, దృశ్య కావ్యాలతో మౌన రాగాలు ఆలపించి, భారతీయుల గుండెల్లో రోజా పూలు పూజించడం. ఒక మంచి డైరెక్టర్ గా ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం మణిరత్నం. ఈయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత అలాగే రచయిత కూడా.

మణిరత్నం 1956 జూన్ 2వ తేదీన జన్మించారు. ఈయన సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ,ఈయన చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకోలేదు. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, అతను కన్సల్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 1983 లో కన్నడ చిత్రం పల్లవి అను పల్లవి ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు.  మణిరత్నం అని వృత్తిరీత్యా పిలవబడే ఈయన అసలు పేరు గోపాల రత్నం.

మణి రత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలి. కానీ ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన దాదాపు కొన్ని చిత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. ఇక అందులో భాగంగానే రోజా, బొంబాయి, నాయకుడు మొదలగు చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎక్కువగా తమిళ సినీ ఇండస్ట్రీలో చలనచిత్ర దర్శకుడిగా మాత్రమే పని చేస్తున్నారు. ఇక ఈయన దర్శకత్వం వహించిన  సినిమాలకు గాను ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు , ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్  తో పాటు  ప్రపంచంలోని వివిధ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. 2002 లో  భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ తో సత్కరించింది. ఇక ఇవన్నీ ఆయన సినీ కెరియర్ లో కీలకమైన అంశాలు గా పరిగణించవచ్చు.

ఇక మణిరత్నం గారి వ్యక్తిగత విషయానికి వస్తే, ఈయన దక్షిణ భారత సినిమాలో స్థిరపడిన నటి సుహాసినిని 1988 లో వివాహం చేసుకున్నారు . ఈ దంపతులకు 1992 లో నందన అనే ఒక కుమారుడు కూడా జన్మించారు. ఇక నందన్ ప్రస్తుతం బ్రిటన్ లోని ఎడింబరో లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం చెన్నైలోని అల్వార్‌పేట్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది . ఇక అక్కడే అతను తన నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌ను నడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: