అకిరా నందన్ పై బండ్ల గణేష్ లీకులు టెన్షన్ లో పవన్ అభిమానులు !

Seetha Sailaja

పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అని అభిమానులు చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 6 అడుగుల 4 అంగుళాల పొడుగుతో ఉండే అకిరా మెగా కుటుంబ హీరోలు అందరిలోకి చాల పొడుగు దీనితో మెగా హీరోల రికార్డులను మించి అకిరా నందన్ సినిమా రికార్డులు ఉండబోతోతాయి అన్న ఊహలతో మెగా అభిమానులు ఉన్నారు.
దీనికితోడు అకిరా సినిమా ఎంట్రీ గురించి రేణు దేశాయ్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ అకిరా హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె పరోక్షంగా ఇస్తున్న లీకులు మరింతగా పవన్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు అకిరా మొట్టమొదటి సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా ఉంటాడు అన్న ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి.

అయితే దీనికి భిన్నంగా బ్లాక్ బష్టర్ నిర్మాత బండ్ల గణేష్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక మెసేజ్ పవన్ అభిమానులకు కలవర పెడుతోంది. ‘నా దేవుడుతో నా హీరో’ అంటూ పవన్ పక్కన అకిరా నుంచుని ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటోతో బండ్ల గణేష్ జత చేసిన కామెంట్స్ అనేక సందేహాలకు తావు ఇస్తూ అకిరా నందన్ నటించబోయే మొట్టమొదటి సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించబోతాడా అన్న సందేహాలు వస్తున్నాయి.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ తీయాలని బండ్ల గణేష్ చాల కాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడి ప్రయత్నాలకు ఇంకా పవన్ నుండి పూర్తి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనితో పవన్ ను ఒప్పించి అకిరా నందన్ మొట్టమొదటి సినిమాకు తానే నిర్మాతగా మారాలి అన్న ఎత్తుగడలో ఉన్నాడా అన్న సందేహాలు పవన్ అభిమానులకు కలగడంతో రామ్ చరణ్ కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో అకిరా నందన్ మొదటి సినిమా ఉంటే అది ఎంతవరకు అకిరా కెరియర్ కు మంచి జరుగుతుంది అన్న భయంతో అభిమానులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: