ఇళయరాజా జీవితంలో మనకు తెలియని మరికొన్ని విషయాలు..

Divya

ఇళయరాజా.. ఈయన అసలు పేరు జ్ఞానదేశికన్.. 1943 జూన్ 2న తమిళనాడులోని తేనీ జిల్లాలో పన్నైపురంలో జన్మించారు. తండ్రి రామస్వామి,  తల్లి చిన్మతాయమ్మాల్.  ఈ దంపతులకు ఇళయరాజా మూడవ కుమారుడిగా జన్మించారు. సినీ ఇండస్ట్రీ కి ఒక గొప్ప సంగీతాన్ని అందించడంలో ఈయనకు ఈయనే దిట్ట. ఇక ఈయన పేరు వింటే చాలు సంగీత ప్రియులు వారిని వారే మైమరచిపోతారు. ఇక ఈయన పేరు సినీ ఇండస్ట్రీలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి, తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. ఇక అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సంగీతదర్శకుడు ఈయన.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి మ్యూజిక్ నిచ్చిన మొదటి సినిమా భద్రకాళి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా తొలిచిత్రం తమిళంలో తెరకెక్కిన అన్నక్కలి. ఇక ఇళయరాజా సంగీతానికి గాను జాతీయ అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలైన సాగర సంగమం, రుద్రవీణ సినిమాలకు జాతీయ అవార్డు లభించడం విశేషం. ఇక తెలుగులో ఎవరూ ఊహించని విధంగా ఎన్నో మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్స్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్ వంటి  స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ను అందించింది  ఇళయరాజా మాత్రమే. ఇక 2004లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ హయాంలో  జాతీయ అవార్డును కూడా పొందారు..

ఇక అంతే కాదు నాటి నుంచి నేటి వరకు అగ్ర హీరోల గా కొనసాగుతున్న బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మైమరచిపోయే సంగీతాన్ని అందించారు ఇళయరాజా. ఆయన 2010లో పద్మభూషణ్  పురస్కారం కూడా అందుకున్నారు. అంతేకాదు 2018 లో కేంద్ర నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 40 ఏళ్లకు పైగా తన సినీ జీవితంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డు సృష్టించారు. సినీ ఇండస్ట్రీ చరిత్రలో గొప్పగా గుర్తించుకొనే ఏకైక వ్యక్తి ఇళయరాజా గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: