తెలుగులో సినిమాలు చేయనని తేల్చి చెప్పిన జాన్వీ కపూర్.. కారణం ఇదే.!

Divya


జాన్వి కపూర్ అనగానే ముందుగా అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి అని గుర్తుకొస్తుంది . జాన్వి కపూర్ హిందీ లో 2018 లో దఢక్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. జాన్వి 1997 మార్చి 6 వ తేదీన మహారాష్ట్ర,  ముంబైలో ప్రముఖ నిర్మాత బోని కపూర్, స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి లకు జన్మించింది. ఈమె 2018 లో దఢక్ సినిమాలో నటించినప్పుడు,  నామినేటెడ్ ఫిలిం ఫేర్ అవార్డు కింద ఉత్తమ తొలినటి అవార్డుతోపాటు  జీ సినీ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఆమెకు ఒక చెల్లెలు కూడా వుంది  పేరు ఖుషి కపూర్. ఆమె నటులు అనిల్ కపూర్ అలాగే సంజయ్ కపూర్ ల మేనకోడలు . ఆమె ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది .

ఆమె సినీరంగ ప్రవేశం చేయడానికి ముందు, కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ తోపాటు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుండి నటనలో శిక్షణ కూడా తీసుకుంది. 2018 లో దఢక్, 2020 లో నెట్‌ఫ్లిక్స్ హర్రర్ ఆంథాలజీ చిత్రం ఘోస్ట్ స్టోరీస్‌, 2020 లో గుంజన్ సక్సేనా, 2020 లోనే దెయ్యం కథలు, 2021 లో రూహి వంటి పలు చిత్రాలలో నటించి, మంచి విజయం అందుకుంది జాన్వి కపూర్. అయితే ఇటీవల ఈ సంవత్సరంలో గుడ్ లక్ జెర్రీ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు మరో సినిమా  దోస్తానా - 2 లో కూడా నటించబోతోంది. ప్రస్తుతం ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తవ లేదు.

అయితే ఇంతలా మంచి పేరు సంపాదించుకున్న జాన్వికపూర్, తెలుగులో సినిమాలు చేయను అంటూ తన తండ్రితో ఖచ్చితంగా తేల్చి చెప్పినట్లు సమాచారం. ఆమె ఇలా అనడానికి గల కారణాలు కూడా చెప్పేసింది. తెలుగు ఇండస్ట్రీలో కేవలం హీరో కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్ విషయానికి వస్తే ఆమెలో అందం మాత్రమే చూస్తారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ లోకి నేను వెళ్తే నన్ను ఎవరూ పట్టించుకోరు. అందుకే నేను తెలుగు ఇండస్ట్రీలో కి వెళ్ళను అంటూ ఆమె తన తండ్రి బోనీ కపూర్ తో  తేల్చి చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: