ఇళయరాజా అందుకున్న అవార్డులు ఇవే!

Chaganti
ఇళయరాజా పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని ఆయన. తెలుగులో ‘భద్రకాళి’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఇళయరాజా మెల్ల మెల్లగా తన విభిన్నమైన వాయిద్యాలతో కొత్త తరహా స్వరాలను సంగీతాభిమానులకు అలవాటు చేయడం మొదలు పెట్టాడు. ఇళయరాజా అసలు పేరు జ్ఞాన దేశికన్. స్కూల్ లో చేర్పించేటప్పుడు జ్ఞాన దేశికన్ పేరును ఆయన తండ్రి రాజయ్యగా మార్పించారు. సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును రాజాగా మార్చారు. 


76లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటి సినిమా ’అన్న కిలి’ చేస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత అరుణాచలం ఆయనని ’ఇళయ’ (అంటే చిన్నవాడు అని తమిళ్‌లో అర్థం) అని పిలిచేవాడు. ఆ రోజుల్లో ఏ.యం. రాజా అని మరో సంగీత దర్శకుడు ఉండటంతో ఈ రెండు పదాలు కలిపి ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ పెట్టారు. ఇక తన 40 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు ఆయన. ఇ


క ఆయన అవార్డులు రివార్డుల విషయానికి వస్తే 2010 లో భారత ప్రభుత్వం ’పద్మభూషణ్’ ..2018 ప్రధాని మోదీ ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో ఆయన్ని గౌరవించింది. ఇక నాలుగు సార్లు ఆయన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సంగీత దర్శకుడుగా నిలిచారు. 13 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్, మూడు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులు, నాలుగు నంది పురస్కారాలు, ఏడు తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డులు ఆయన సాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: