నాగార్జున వదిలేసిన 10 సినిమాలు ఏంటో తెలుసా ?

Divya

సినీ ఇండస్ట్రీలో నాగార్జున అంటే ఒక మంచి గుర్తింపు ఉంది. అంతే కాకుండా టాలీవుడ్ లో నవ మన్మధుడు అనే పేరు కూడా సంపాదించాడు. అయితే నాగార్జున తన సినీ కెరీర్ లో మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేసుకుంటూ వచ్చాడు. గీతాంజలి,శివ లాంటి సినిమాలు తీసిన తర్వాత.. నాగార్జున 36 ఏళ్ళ సినీ కెరీర్లో దాదాపు 10కి పైగా సినిమాలను నో చెప్పాడు. వాటికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

1). మెకానిక్ అల్లుడు:
కొన్ని కొన్ని సార్లు కొన్ని కాంబినేషన్స్ కుదరవు. అలా నాగార్జున నటించాల్సిన సినిమా కాస్త చిరంజీవి చేతుల్లోకి వెళ్ళిపోయింది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో ముందు నాగార్జున తో ప్లాన్ చేశారు. పైగా ఈ చిత్రంలో నాగేశ్వరరావు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ట్రాక్ రికార్డు బాగా లేకపోవడంతో నాగార్జున ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

2) మౌనరాగం:
నాగార్జున మొదట్లో చాలా క్లాసిక్ సినిమాలలో నటించాడు. కానీ సినీ ఇండస్ట్రీకి కొత్త లో మాత్రం ఒక క్లాసిక్ సినిమాను  వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే తను కొత్తగా ఇండస్ట్రీకి రావడంతో పెద్దగా కథలు తెలియకపోవడంతో ఇలాంటి ఓ మంచి సినిమాను  చేజార్చుకున్నాడు. అదే మౌన రాగం సినిమా.

3). కలిసుందాం రా:
నాగార్జున నుంచి మరో బ్లాక్ బాస్టర్ మిస్సయింది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి వదులుకోవడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లోనే తను ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేస్తుండడంతో.. అది రొటీన్ కదా అనిపించడం, అంతేకాకుండా తాను గతంలో చేసిన"రాముడొచ్చాడు" లాంటి సినిమా కథ లాగే ఈ సినిమా కథ కూడా ఉండడం తో ఈ సినిమాను నాగార్జున రిజెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా వెంకటేష్ తీసి , ఇండస్ట్రీ హిట్ సాధించాడు.

4). బద్రి:
పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా తీసిన తొలి సినిమా బద్రి. బద్రి కథను నాగార్జునకు చెప్పినప్పుడు పూరి అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కానీ ఈ సినిమాని 30 రోజులు పవన్ కళ్యాణ్ వెంటబడి మరీ  బద్రి సినిమాలో, పవన్ కళ్యాణ్ ను  ఒప్పించి హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్.. ఆ తర్వాత శివమణి  లాంటి  సూపర్ సినిమా చేసి నాగార్జున కు మంచి హిట్ ఇచ్చాడని చెప్పవచ్చు.

5). దళపతి:
మణిరత్నం క్లాసికల్ బ్లాక్ బాస్టర్ సినిమా దళపతి. ఈ సినిమా ముందు నాగార్జున దగ్గరికి వచ్చింది. కానీ అప్పటికే గీతాంజలి సినిమా చేయడంతో నాగార్జున సత్తా తెలిసిన మణిరత్నం, ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి చేయాలనుకున్నాడు. ఇందులో రజనీకాంత్ కు ఒక పాత్ర ఇచ్చి.. ఆ తర్వాత ముమ్ముట్టి కోసం నాగార్జున అనుకున్నాడు. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి నాగార్జున తప్పుకోవాల్సి వచ్చింది.
6). ఆర్ జీ వీ  రామాయణం:

 శివ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత నిదానంగా తను తీయబోయే సినిమాలన్నీ యావరేజ్ గా కూడా ఆడకపోవడంతో నాగార్జున కూడా ఈ సినిమాని నటించడానికి నో చెప్పాడట.. దాదాపు పదేళ్ళ కిందట నాగార్జునతో రామాయణం అనే సినిమా చేయాలనుకున్నప్పుడు వర్మ , ఈ సినిమాని నిర్ధాక్షణ్యంగా నో చెప్పాడంట నాగార్జున.
7) ఆహా:
నాగార్జున హీరో మాత్రమే కాదు మంచి నిర్మాత కూడా. అలా తాను చేయలేని సినిమాలను మరో హీరోతో నిర్మించాడు నాగార్జున .అలా మిస్సయిన సినిమాలలో ఆహా కూడా. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ సినిమాను నిర్మించాడు నాగార్జున.

8). ఘర్షణ:
మణిరత్నం దర్శకత్వంలో నటించాలని నాగార్జునకు చాలా కోరిక ఉండేది. కెరియర్ మొదట్లో ఈ అవకాశం ఆయన చెంతకు వచ్చింది. కానీ అనుకోని కారణాలతో మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆఫర్ ను చేజార్చుకున్నాడు. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా తన దగ్గరకు వచ్చిన ఘర్షణ సినిమాలో నాగార్జున చేయలేకపోయాడు. అయితే 1988లో ఇది జరిగితే పట్టుబట్టి మరీ మరుసటి ఏడాది గీతాంజలి సినిమా చేసాడు నాగార్జున.
అలాగే తమిళ్ లో  నాన్ రుద్రన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా నాగార్జున వదిలేసిన  ఈ 10  సినిమాలు మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: