ఓటిటి లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత ?

VAMSI
ప్రస్తుతం దేశంలో కరోనా టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడగా, సినీ రంగంపై కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. షూటింగులకు బ్రేకులు పడి క్లోజ్ అయ్యాయి. ఈ గ్యాప్ లో ఓటిటిల హవా ఓ రేంజ్ లో ఊపందుకున్న  విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కరోనా ఏమని వచ్చిందో గాని సినీ పరిశ్రమ విధి విధానాలు పూర్తిగా మారిపోయాయి అంటూ ఆయన చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కరోనా ఏమని వచ్చిందో గాని ఇండస్ట్రీలో పెను మార్పులు తీసుకు వచ్చిందని, జనాల సినిమా వీక్షణ, వ్యూవర్ షిప్ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అని, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా దీని ప్రభావం థియేటర్లపై ఉండబోతోందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. 

ప్రైమ్ లు, ప్యాకేజీల రూపంలో ఆఫర్లు విరివిగా అందుతున్న సందర్భంలో ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ నే ఎక్కువగా వాడడం ఇప్పటికే అలవాటు చేసుకున్నారు అని, చేతిలో ఫోన్ పెట్టుకొని వినోద కార్యక్రమాలను, సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించ గలిగే వెసులుబాటు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటే ఆలోచించే పరిస్థితి మొదలైందని ఆయన పేర్కొన్నారు. దీంతో రాను రాను సినిమా హాల్ కు తరలి వచ్చే జనాల సంఖ్య కూడా తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక నగరాల్లో మాత్రం మల్టీప్లెక్స్ లకు ప్రజలు బాగా ఆకర్షితులు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

కాగా హైదరాబాద్ మరియు పలు ప్రముఖ నగరాల్లో సురేష్ బాబుకు మల్టీప్లెక్స్ లు ఉన్న విషయం తెలిసిందే. కరోనా రాక ఓటిటి లకు కానుకగా మారిందన్నారు సురేష్ బాబు.  అంతటి ప్రయోజనం ఉన్నప్పుడు మీరే నూతనంగా ఓటీటీ ని ఎందుకు ప్రారంభించకూడదు అని అడుగగా, తనకు ఇప్పట్లో ఓటిటి ప్రారంభించాలన్న ఉద్దేశ్యం లేదని, అయినా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర కంపెనీలు ఓటీటీ లకు బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నా పెద్దగా లాభాలు లేకపోగా లాస్ లో నడుస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సురేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: