కొరటాల, ఎన్టీఆర్ సినిమా టైటిల్ అప్పుడేనా..?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయినా విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చిత్రకరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 20వ తేదీన ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా చివరకు నిరాశే ఎదురైంది. అయితే అప్పుడు నిరుత్సాహపరిచిన కొరటాల శివ త్వరలో తారక్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారని సమాచార.
అయితే జూన్ నెల 15వ తేదీన కొరటాల శివ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆరోజు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ బర్త్ డేకు అప్ డేట్ మిస్సైనా కొరటాల బర్త్ డేకు మాత్రం అప్ డేట్ కచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. కొరటాల శివ మరోసారి ప్రేక్షకుల అంచనాలకు అందని టైటిల్ తో సర్ప్రైజ్ చేయనున్నారని తెలుస్తోంది.
కాగా, ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను కొరటాలశివ అద్భుతంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటానని భావిస్తున్నారు. ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: