చిరు, వెంకీ స్టార్స్ గా ఎదగడానికి కారణం ఆయనే నట.!

Divya

సినీ ఇండస్ట్రీలో లో దశాబ్ద కాలం పాటు తమ హవాను కొనసాగిస్తూ వస్తున్న వారిలో మెగాస్టార్  చిరంజీవి , విక్టరీ వెంకటేష్ లు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ ప్రారంభంలో మొత్తం అన్నీ నెగటివ్ రోల్స్ చేసేవారు. అలాగే సెకండ్ హీరోగా కూడా చేసేవారు. ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టారు అయితే ఆయనకు స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది మాత్రం "ఖైదీ" అని చెప్పుకోవాలి. 1953 వ సంవత్సరం లో అక్టోబర్ 28న ఈ చిత్రం విడుదల అయింది. ఈ చిత్రానికి  కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు.

అయితే మొదట ఈ చిత్రానికి హీరోగా చిరంజీవి ని సెలెక్ట్ చేయలేదట. సూపర్ స్టార్ కృష్ణ గారి ని సెలెక్ట్ చేశారు. కానీ ముందుగా ఆయన వేరు నిర్మాతలతో సినిమా చేయడానికి సైన్ చేయడంతో, ఆ సినిమాని వదిలేయాల్సి వచ్చింది కృష్ణకి  . అయితే ఖైదీ సినిమా ను ,  ఆ  నిర్మాత తోనే చేద్దామని ప్రయత్నాలు చేసినా.. అందుకే ఆ నిర్మాత ఒప్పుకోలేదు. ఆ కారణంగానే కృష్ణగారు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం జరిగింది.

అలా కృష్ణ వదిలిపెట్టిన మూవీనే  చిరంజీవి చేసి, ఆ సినిమా ద్వారా మెగా స్టార్ గా ఎదిగాడు. ఇక కృష్ణ గారు రిజెక్ట్ చేసిన మరో సినిమా "కలియుగ పాండవులు" . కె.రాఘవేంద్రరావు గారు ఈ చిత్రాన్నికి దర్శకుడు. ఈ చిత్రం చేయవలసిన టైంలో కృష్ణ  మరో రెండు ప్రాజెక్టులకు బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ద్వారా  వెంకటేష్ హీరోగా లాంచ్ చేయమని రామానాయుడు గారి కి సలహా ఇచ్చింది కూడా కృష్ణ గారే.

అలా ఈ  సినిమా ను వెంకటేష్  చేశారు. ఈ సినిమా 1986 సంవత్సరం ఆగష్టు 14 న విడుదలై, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంకటేష్ హీరోగా నిలదొక్కుకున్నారు.. అటు ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలుగా ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: