జూన్ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న సెలబ్రిటీలు ఎవరంటే...?

Suma Kallamadi
మనం ఎవరిని అన్నా అభిమానిస్తే ప్రాణం పోయేదాకా వాళ్ళ మీద ఆ అభిమానం అనేది అలాగే ఉంటుంది.  సినిమాల్లో నటించే హీరోలను కూడా ప్రేక్షకులు అలాగే అభిమానిస్తారు. ఎవరికి నచ్చిన హీరోను, సెలబ్రిటీని వాళ్ళు అభిమానిస్తారు.అలా అభిమానులు అభిమానించే హీరోలను గాని,సెలెబ్రిటీలను గాని ఎవరయినా ఒక్క మాట అంటే చాలు రచ్చ రచ్చ చేస్తారు.వాళ్ళు అభిమానించే హీరోల పుట్టినరోజు వస్తే చాలు ముందు రోజు నుంచి పండగ వాతావరణం మొదలు పెట్టేస్తారు.సోషల్ మీడియా మొత్తం పుట్టినరోజు వేడుకలతో కళ కళ లాడిపోతుంది. అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు మే నెలలో పుట్టినరోజులు జరుపుకున్నారు.అలాగే ఈ రోజు గడిస్తే జూన్ నెలలో అడుగు పెడతాం.అయితే మరి ఈ జూన్ నెలకి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా అది ఏంటంటే ఈ జూన్ నెలలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలెబ్రిటీలు పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. మరి జూన్ నెలలో పుట్టినరోజు జరుపుకునే  సెలబ్రిటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామా. !

హీరో మాధవన్, నిఖిల్, నటి హేమ వీరందరూ కూడా  జూన్ 1వ తేదీనే పుట్టినరోజును జరుపుకోనున్నారు.అలాగే వీరితో పాటు జూన్ నెల 1వ తేదీన ఎస్వీ కృష్ణారెడ్డి , ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు కూడా కావడం గమనార్హం..అలాగే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, సంగీత దర్శకులు అయిన మణిరత్నం, ఇళయరాజాలు జూన్ 2 వ తేదీన పుట్టినరోజు జరుపుకోనున్నారు.ఇంకా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా జూన్ 2వ తేదీన పుట్టినరోజును జరుపుకోనున్నారు.అలాగే మన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి,ప్రముఖ ప్రఖ్యాత గాన గాంధర్వుడు సింగర్ ఎస్పీ బాలు గారు, నటుడు వేణులు జూన్ 4వ తేదీన పుట్టినరోజులు జరుపుకోనున్నారు.ఇకపోతే ఒకనాటి గ్లామరస్ హీరోయిన్ రంభ జూన్ 5వ తేదీన జన్మించారు.జూన్ 6 వ తేదిన ప్రముఖ దర్శకుడు డాక్టర్ డి. రామానాయుడు జయంతి.అలాగే సీనియర్ హీరోయిన్ సరిత జూన్ 7న పుట్టినరోజును జరుపుకోనున్నారు.ఇకపోతే జూన్ 8 వ తేదిన ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు.


జూన్ 9 అమీషా పటేల్ పుట్టిన రోజు జరుపుకోనుంది. ఇంకా టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈ స్టార్ హీరో పుట్టినరోజు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ జూన్ 10వ తేదీన జన్మించారు. బాలయ్య పుట్టినరోజుతో పాటు సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.అలాగే జూన్ 12న హీరో  గోపీచంద్ పుట్టినరోజు కాగా జూన్ 14 బింధుమాధవి పుట్టినరోజు కావడం గమనార్హం.జూన్ 15 దర్శకుడు  కొరటాల శివ పుట్టినరోజు.అలాగే జూన్ 16న అంజలి పుట్టినరోజును జరుపుకోనున్నారు.

జూన్ 17న అరవిందస్వామి, జూన్ 19న  అందాల నటి కాజల్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.జూన్ 20న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి , జూన్ 22న కోలీవుడ్ హీరో విజయ్ పుట్టినరోజు కాగా జూన్ 24న సీనియర్ నటి  విజయశాంతి, మురళీమోహన్ లు పుట్టినరోజును జరుపుకోనున్నారు. జూన్ 26న దివంగత నటుడు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు కాగా జూన్  కాగా జూన్ 30వ తేదీన అల్లరి నరేష్ తమ్మారెడ్డి భరద్వాజ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.చూసారు కదా జూన్ నెలలో ఎంతమంది సెలెబ్రిటీలు పుట్టినరోజును జరుపుకుంటున్నారో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: