సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?

Divya

సాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు నిర్మించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరీ అతి చిన్న వయసులోనే మహేష్ బాబు, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో నటించి, అందరి చేత మన్ననలు పొందాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించిన చిత్ర విశేషాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1. పోరాటం :
1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణ కు తమ్ముడి పాత్రలో నటించాడు మహేష్ . ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు నటించిన తీరుకు గానూ ప్రముఖ దర్శక -  నిర్మాత డూండీ, పోరాటం సినిమా లో మహేష్ బాబు నటించడంతో అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి, ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు కూడా ఇచ్చాడు..

2. శంఖారావం :
1987 లో తొలిసారిగా కృష్ణ దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో మహేష్ బాబు నటించాడు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు.

3. ముగ్గురు కొడుకులు :
1988 లో మహేష్ బాబు తన తండ్రి, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.

4. బజార్ రౌడీ :
1988లో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో, తన అన్న రమేష్, తండ్రి కృష్ణ లు నటించారు. ఇక ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో మహేష్ నటించి అందరినీ అబ్బుర పరిచాడు.

5. గూడచారి 117:
తొలుత కృష్ణ గూడచారి 116 సినిమా లో నటించి అందరి మన్ననలు పొందాడు  ఆ తర్వాత 1989లో తిరిగి మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన, గూడచారి 117  లో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటించారు.

6. కొడుకు దిద్దిన కాపురం:
1989లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు.

7. బాలచంద్రుడు :
1990 లో విడుదలైన ఈ చిత్రంలో ఫుల్  లెన్త్ పాత్ర పోషించి, ఇక హీరోగా రెడీ అవడానికి సిద్ధమని నిరూపించాడు.

8. అన్న - తమ్ముడు :
మహేష్ బాబు చివరిసారిగా తన తండ్రి కృష్ణ తో కలిసి నటించిన చిత్రం అన్నా తమ్ముడు. ఇక ఈ చిత్రం ద్వారా బాలనటిగా తన తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: