చరణ్ సినిమాలో జూనియర్ అతిలోక సుందరి .... ??

GVK Writings
ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి తీస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్నారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అలానే కీరవాణి మ్యూజిక్ ని అందిస్తున్నారు.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ పాటికే పూర్తి కావలసి ఉండగా ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా అర్ధాంతరంగా షూట్ ని నిలిపేశారు. ఇక ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు చరణ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుత రాజకీయల నేపథ్యంలో ఎంతో భారీ రేంజ్ లో రూపొందనున్నట్లు టాక్ .ఇక ఈ సినిమాలో చరణ్ ఒక యువ నాయకుడిగా కనిపించనుండగా థమన్ దీనికి మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.
కాగా ఈ సినిమాలో ఒక స్టార్ నటి హీరోయిన్ గా నటించనుందనే వార్త కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో లేటెస్ట్ గా మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా జూనియర్ అతిలోక సుందరి, అదేనండి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎంపికైందట. ఇటీవల ముంబై వెళ్లి జాన్వీని కలిసి ప్రత్యేకంగా ఆమెకు తమ సినిమా స్టోరీ వినిపించి ఆమోదం అనుకున్న దర్శకుడు శంకర్ ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే ఈ మూవీ ద్వారా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అనే చెప్పాలి ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: